Flipakart బిగ్ బిలియన్ డేస్ సేల్ : నమ్మలేని ధరతో అమ్ముడవనున్న టాప్ 5 స్మార్ట్ ఫోన్లు

Updated on 27-Sep-2019
HIGHLIGHTS

Flipakart  దీపావళి కోసం తన బిగ్ బిలియన్ డేస్ సేల్ ని తీసుకొచ్చింది. అంతేకాదు, ఈ సేల్ నిజంగా వినియోగదారులకు మంచి లాభాలను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు చాలా ఎక్కువ ధరలకు అమ్ముడవుతున్న చాలా ట్రెండీ మొబైల్ ఫోన్ల పైన భారీ డిస్కౌంట్లు మరియు గొప్ప ఆఫర్లను ప్రకటించింది. వాటిలో మంచి ఆఫర్లతో అమ్ముడవనున్న టాప్ 5 స్మార్ట్ ఫోన్ల జాబితాను ఇక్కడ అందిస్తున్నాను.

1.XIAOMI REDMI NOTE 7 PRO

ప్రస్తుత ధర : Rs.13,999

బిగ్ బిలియన్ డేస్ సేల్ ధర : Rs.10,999 

ఇండియాలో మిడ్ రేంజ్ ధరలో ఒక 48MP ప్రధాన కెమేరా, అదీకూడా SONYIMX586 సెన్సారుతో ఒక స్మార్ట్ ఫోన్ను తీసుకొచ్చిన ఘనత, కేవలం షావోమి మాత్రమే సొంతం అని చెప్పొచ్చు. కేవలం, కెమేరా మాత్రమే కాదు ఒక స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసరుతో మంచి స్పీడ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 4GB మరియు 6GB వంటి ర్యామ్ ఎంపికలతో కూడా లభిస్తుంది. అలాగే, ఒక 4,000 బ్యాటరీతో ఒక రోజంతా కూడా చక్కగా సరిపోయేలా అందించారు.

2. REALME 3 PRO

ప్రస్తుత ధర : Rs.13,999

బిగ్ బిలియన్ డేస్ సేల్ ధర : Rs.10,999 

రియల్మీ 3 ప్రో  స్మార్ట్ ఫోన్, 1080 x 2340 రిజల్యూషన్ కలిగిన ఒక 6.3 అంగుళాల వాటర్ నోచ్ డిస్ప్లేతో ఉంటుంది. ఇది 90.8%  స్క్రీన్-టూ-బాడీ రేషియో మరియు FHD+ రిజల్యూషన్ అందిస్తుంది. ఒక క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 710 ఆక్టా కోర్ ప్రొసెసరుకి జతగా అడ్రినో 616 మరియు 4GB మరియు 6GB ర్యామ్ శక్తితో వస్తుంది. 16MP కెమేరాకు జతగా f/2.4 అపర్చరు కలిగిన మరొక 5MP సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమేరాతో ఉంటుంది. ఈ ప్రాధాన 16MP కెమెరా ఒక SonyIMX519  సెన్సారుతో వస్తుంది.         

3. Xiaomi POCO F1

ప్రస్తుత ధర : Rs.17,999

బిగ్ బిలియన్ డేస్ సేల్ ధర : Rs.14,999

షావోమి పోకో F1 స్మార్ట్ ఫోన్ 2340 x 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.18 అంగుళాల FHD+ నోచ్ డిస్ప్లేతో అందించబడుతుంది. అలాగే, ఇది ఒక ప్రధాన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 845 ఆక్టా కోర్ ప్రొసెసరుతో నడుస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ ఒక భారీ 4000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 6GB ర్యామ్ జతగా 64GB వేరియంట్ మరియు అత్యధికంగా 8GB ర్యామ్ జతగా 256GB వేరియంట్తో వస్తుంది. వెనుక భాగంలో 12MP +5MP  డ్యూయల్  కెమేరా సేటప్పుతో వస్తుంది.

4. Vivo Z1 Pro

ప్రస్తుత ధర : Rs.15,999

బిగ్ బిలియన్ డేస్ సేల్ ధర : Rs.12,999

ఈ స్మార్ట్ ఫోన్  మధ్య స్థాయి ధరలో  2340 x 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.53 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 32MP సెల్ఫీ కెమెరా, 16MP+8MP+2MP  ట్రిపుల్ వెనుక కెమెరా మరియు 5000mAh బ్యాటరీ వంటి లక్షణాలతో వస్తుంది.  అంతేకాదు,ఇది వేగవంతమైన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 712AIE ఆక్టా కొర్ ప్రాసెసర్ శక్తితో వస్తుంది మరియు గేమింగ్ కోసం మల్టి టర్బో ఫీచర్లతో వస్తుంది.

5.  NOKIA 6.1 PLUS

ప్రస్తుత ధర : Rs.15,999

బిగ్ బిలియన్ డేస్ సేల్ ధర : Rs. 8,999

ఈ నోకియా 6.1 స్మార్ట్ ఫోన్ 2340 x 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.4 అంగుళాల FHD+ నోచ్ డిస్ప్లేతో అందించబడుతుంది. అలాగే, ఇది ఒక స్నాప్ డ్రాగన్ 636 ఆక్టా కోర్ ప్రొసెసరుతో నడుస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ ఒక 3060 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 4GB ర్యామ్ జతగా 64GB వేరియంట్ మరియు మరొక 6GB ర్యామ్ వేరియంట్తో వస్తుంది. వెనుక భాగంలో 16MP +5MP డ్యూయల్ రియర్ కెమేరా సేటప్పుతో మరియు ముందు 16MP సెల్ఫీ కెమేరాతో వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :