గూగుల్ పిక్సెల్ సిరీస్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Google Pixel 9A, ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ సేల్ బిగ్ నుంచి బిగ్ డీల్ అందుకుంది. ఈ స్మార్ట్ ఫోన్ జబర్దస్త్ కెమెరా సెటప్ మరియు మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ తో ఉంటుంది. ఈ ఫోన్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి బెస్ట్ డీల్స్ తో మంచి ఆఫర్ ధరలో అందుకోవచ్చు. అందుకే ఈ బెస్ట్ డీల్ ను మీ కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాము.
గూగుల్ పిక్సెల్ 9a స్మార్ట్ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 20% డిస్కౌంట్ తో రూ. 39,999 ప్రైస్ తో సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ ఫోన్ పై HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూ. 3,000 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 36,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.
ఈ గూగుల్ ఫోన్ ఐరిస్ ఒడిసియన్ మరియు పార్స్లీన్ మూడు రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి గొప్ప ఆఫర్ ధరలో లభిస్తుంది.
Also Read: BSNL Super Plan: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే సంవత్సరం మొత్తం హ్యాపీ గా ఉండొచ్చు.!
గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ 2025 లో విడుదలైన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్. ఇది పిక్సెల్ సిరీస్ లోని శక్తివంతమైన ఫీచర్లు మరియు అందమైన డిజైన్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.3 అంగుళాల ఆక్టువా pOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ స్క్రీన్ 1080×2424 పిక్సెల్స్ రిజల్యూషన్ మరియు 60-120Hz స్మూత్ రిఫ్రెష్ రేట్ కూడా వస్తుంది. ఇది HDR సపోర్ట్ తో 2700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
గూగుల్ పిక్సెల్ 9a స్మార్ట్ ఫోన్ గూగుల్ Tensor G4 చిప్‌సెట్ తో నడుస్తుంది మరియు జతగా 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో అందుబాటులో ఉంటుంది. అదనంగా ఈ ఫోన్ లో Titan M2 సెక్యూరిటీ కో-ప్రాసెసర్ కూడా ఉంది. ఈ అదనపు చిప్ హై-లెవల్ హార్డ్‌వేర్-ఆధారిత సెక్యూరిటీని అందిస్తుంది.
ఇక ఈ ఫోన్ కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్‌లో 48MP ప్రైమరీ కెమెరా మరియు 13MP అల్ట్రా వైడ్ లెన్స్కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ తో మీరు అధిక-నాణ్యత ఫోటోలు మరియు సూపర్ 4K రిజల్యూషన్ వీడియోలు షూట్ చేయడానికి వీలవుతుంది. అలాగే, ఫోన్ లో ముందు వైపు 13MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ కెమెరా సాఫ్ట్ వేర్‌లో AI-పవర్డ్ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో బెస్ట్ టేక్, మ్యాజిక్ ఎడిటర్, యాడ్ మీ, నైట్ సైట్ వంటి బెస్ట్ ఫోటో ఎడిటింగ్ టూల్స్ ఉన్నాయి. ఈ బెస్ట్ ఫీచర్స్ వలన ఫోటోలు మరింత ఆకర్షణీయంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది.