MOTOROLA Edge 60 Fusion 5G పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్.!

Updated on 23-Oct-2025
HIGHLIGHTS

MOTOROLA Edge 60 Fusion 5G పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అనౌన్స్ చేసింది

ఎక్స్ చేంజ్ బోనస్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది

ఈ ఫోన్ ను కేవలం రూ. 17,499 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు

MOTOROLA Edge 60 Fusion 5G స్మార్ట్ ఫోన్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు డిస్కౌంట్, అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. అందుకే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ బ్యాంగ్ దివాళి సేల్ నుంచి అందుబాటులో ఉన్న ఈ బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్ అందిస్తున్నాను.

MOTOROLA Edge 60 Fusion 5G : ఆఫర్

మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ రూ. 22,999 రూపాయల స్టార్టింగ్ ప్రైస్ తో ఇండియాలో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళి సేల్ నుంచి రూ. 3,000 డిస్కౌంట్ తో కేవలం రూ. 19,999 రూపాయల డిస్కౌంట్ ధరలో సేల్ అవుతోంది. అలాగే, రూ. 24,999 ధరలో వచ్చిన హై ఎండ్ వేరియంట్ కూడా 3 వేల డిస్కౌంట్ తో రూ. 21,999 ధరలో సేల్ అవుతోంది.

ఈ స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ తో తీసుకునే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఇది కాకుండా ఈ ఫోన్ పై రూ. 1,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందించింది. ఈ రెండు ఆఫర్స్ అందుకుంటే ఈ ఫోన్ ,మరో రూ. 2,500 తక్కువ ధరకు లభిస్తుంది. అంటే, ఈ ఫోన్ ను కేవలం రూ. 17,499 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు.

Also Read: Samsung Galaxy AI బడ్స్ భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 2,899 రేటుకే లభిస్తోంది.!

MOTOROLA Edge 60 Fusion 5G : ఫీచర్స్

మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ చాలా స్లీక్ మరియు స్టన్నింగ్ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6. 67 ఇంచ్ ట్రూ క్వాడ్ కర్వుడ్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఇది ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 1.5K రిజల్యూషన్, 120 Hz రిఫ్రెష్ రేట్ మరియు 4500 లోకల్ బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7400 చిప్ సెట్ తో నడుస్తుంది మరియు 8 జీబీ ర్యామ్ జతగా 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ 50MP Sony LYTIA 700C మెయిన్ కెమెరా, 13MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు జతగా మరో కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ మెయిన్ మరియు సెల్ఫీ కెమెరాలు కూడా 4K UHD వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటాయి. ఈ ఫోన్ 68W టర్బో ఛార్జ్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5500 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ మోటోరోలా ఫోన్ Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు IP 69 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :