flipkart announced year end sale big deals on iPhone 16
iPhone 16 స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ బిగ్ డీల్స్ అనౌన్స్ చేసింది. కొత్త ఐఫోన్ కోసం చూసే వారికి ఇది బెస్ట్ డీల్ అవుతుంది. ఎందుకంటే, యాపిల్ గత వెర్షన్ బేసిక్ వేరియంట్ అయిన ఈ ఫోన్ గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుంది మరియు ఈరోజు ఫ్లిప్ కార్ సేల్ నుంచి బెస్ట్ డీల్స్ తో లభిస్తుంది. 2025 ఇయర్ ఎండ్ సేల్ నుంచి ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ బిగ్ డీల్ వివరాలు చూద్దామా.
యాపిల్ ఐఫోన్ 16 బేసిక్ వేరియంట్ ఇప్పుడు అందుబాటులో లేదు. అయితే, 256 జీబీ వేరియంట్ మాత్రం గొప్ప డీల్స్ తో లభిస్తుంది. ఈ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 67,999 ప్రైస్ తో సేల్ అవుతోంది. ఈ ఫోన్ ను ICICI క్రెడిట్ కార్డు తో కొనే వారికి రూ. 2,500 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిసుంది. అదే, Flipkart SBI క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి ఏకంగా రూ. 3,400 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ మీకు రూ. 64,999 రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తుంది.
Also Read: Realme Pad 3 లాంచ్ కోసం రంగం సిద్ధం.. బిగ్ టైటాన్ బ్యాటరీతో వస్తుంది.!
ఈ ఫోన్ 6.1 అంగుళాల Super Retina XDR OLED డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇది HDR10 మరియు Dolby Vision సపోర్ట్ తో ఉంటుంది మరియు సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ తో చాలా టఫ్ గా ఉంటుంది. ఐఫోన్ 16 3nm టెక్నాలజీ పై తయారైన A18 చిప్ తో నడుస్తుంది. ఇది తక్కువ పవర్ వినియోగించుకుని గేమింగ్ మరియు మల్టీ టాస్కింగ్ లో అధిక పెర్ఫార్మన్స్ అందిస్తుంది.
ఈ ఫోన్ లో 48MP మెయిన్ కెమెరా జతగా 12MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ మరియు ముందు 12MP ట్రూ డెప్త్ సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ లో కొత్త కెమెరా బటన్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ 4K Dolby Vision వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు టన్నుల కొద్ది యాపిల్ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఐఫోన్ 16 Type-C ఛార్జ్ సపోర్ట్ తో పాటు MagSafe అండ్ Qi వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP68 రేటింగ్ వాటర్ మరియు డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్ తో వస్తుంది.
ఓవరాల్ గా చూస్తే, ఐఫోన్ 16 పెర్ఫార్మెన్స్, కెమెరా మరియు సాఫ్ట్ వేర్ అనుభూతి పై ఎక్కువగా బేసి చేసి అందించబడిన ఫోన్ అవుతుంది. ఆపిల్ ఎకోసిస్టమ్ ఎక్కువగా ఇష్టపడే వినియోగదారులకు ఇది గొప్ప ఫోన్ గా ఉంటుంది.