flipkart announced super limited period offer on Nothing Phone (3a)
Nothing Phone (3a) : నథింగ్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ జబర్దస్త్ లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించిన ఆఫర్లతో ఈ నథింగ్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను కేవలం 20,000 రూపాయల బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే, ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్ పై 4,000 రూపాయలు గొప్ప డిస్కౌంట్ అందుకునే బెస్ట్ ఆఫర్లు అందించింది.
నథింగ్ ఫోన్ 3a ఫ్లిప్ కార్ట్ నుంచి రూ . 24,999 ప్రారంభ ధరతో లిస్ట్ అయ్యింది. అలాగే, ఈ ఫోన్ హై ఎండ్ వేరియంట్ రూ. 26,999 రూపాయల ఆఫర్ ధరతో లిస్ట్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు రెండు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఇక ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పై రూ. 2,000 భారీ ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ అందించింది.
అంతేకాదు, ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల HDFC క్రెడిట్, డెబిట్, EMI, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు తో పాటు Flipkart Axis క్రెడిట్ కార్డ్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ నథింగ్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 20,999 ప్రారంభ ధరలో లభిస్తుంది. అలాగే, హై ఎండ్ ఫోన్ రూ. 22,999 ధరలో అందుకోవచ్చు.
Also Read: Google Pixel 10 Pro : లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసిన గూగుల్.!
నథింగ్ ఫోన్ 3a ఫోన్ క్వాల్కమ్ Snapdragon 7s Gen 3 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఇందులో 8 జీబీ ర్యామ్, 128 జీబీ మరియు 256 జీబీ స్టోరేజ్ అప్షన్లు అందిస్తుంది. అలాగే, ఈ ఫోన్ 20 జీబీ వరకు ర్యామ్ బూస్ట్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 6.7 ఇంచ్ AMOLED Flexible LTPS డిస్ప్లే ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు FHD+ రిజల్యూషన్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో గొప్ప ట్రిపుల్ రియర్ కెమెరా మరియు సెల్ఫీ కెమెరా అందించింది. ఈ ఫోన్ లో వెనుక 50MP మెయిన్, 50MP (2x టెలిఫోటో) మరియు 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో ముందు 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ మరియు గొప్ప ఫోటోలు అందించే సత్తా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీని ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.