Google Pixel 10a లాంచ్ కంటే సందర్భంగా పిక్సెల్ 10 ఫోన్ పై భారీ డీల్స్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్.!

Updated on 16-Feb-2026
HIGHLIGHTS

Google Pixel 10a స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 18వ తేదీ ఇండియాలో లాంచ్ అవుతోంది

ఈరోజు ఫ్లిప్ కార్ట్ గూగుల్ పిక్సెల్ 10 స్మార్ట్ ఫోన్ పై ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది

ఈరోజు ఈ ఫోన్ 15 వేల రూపాయల తగ్గింపు తో లభిస్తుంది

Google Pixel 10a స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 18వ తేదీ ఇండియాలో లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ లాంచ్ కావడానికి ఇంకా రెండు రోజులు ఉండగా ఈరోజు ఫ్లిప్ కార్ట్ గూగుల్ పిక్సెల్ 10 స్మార్ట్ ఫోన్ పై ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ ఫోన్ ఇండియాలో విడుదలైన ధరతో సరిపోల్చి చూస్తే, ఈరోజు ఈ ఫోన్ 1 వేల రూపాయల తగ్గింపు తో లభిస్తుంది.

Google Pixel 10a లాంచ్ కంటే ఫ్లిప్ కార్ట్ అందించిన ఆఫర్ ఏమిటి?

గూగుల్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ పిక్సెల్ 10 సిరీస్ లో బడ్జెట్ ఫోన్ పిక్సెల్ 10a ని ఇండియాలో విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను ఇండియాలో ఫిబ్రవరి 18వ తేదీన విడుదల చేస్తుంది. ఈ ఫోన్ లాంచ్ కోసం ఇప్పుడు ఈ ఫోన్ కు ఒక మెట్టు పైన ఉండే గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది.

ఈ ఫోన్ ఇండియాలో రూ. 79,990 ధరలో లాంచ్ కాగా, ఈ రోజు రూ. 5,000 రూపాయల డిస్కౌంట్ తో రూ. 74,990 ప్రైస్ తో ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది. ఈ ఫోన్ పై రూ. 5,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ డిస్కౌంట్ మరియు రూ. 5,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా జత చేసింది. అంటే, మొత్తంగా రూ. 15,000 రూపాయల భారీ తగ్గింపు ఆఫర్లు ఈ ఫోన్ పై అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ లేటెస్ట్ గూగుల్ ఫోన్ కేవలం రూ. 64,990 రూపాయల ఆఫర్ ధరలో ఫ్లిప్ కార్ట్ నుంచి లభిస్తుంది.

Also Read: LG 4K Smart Tv ఈరోజు మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది.!

Google Pixel 10 : ఫీచర్స్

పిక్సెల్ 10 స్మార్ట్ ఫోన్ 6.3 ఇంచ్ ఆక్టువా OLED స్క్రీన్ తో లాంచ్ అయ్యింది. ఈ డిస్ప్లే FHD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో స్మూత్ గా ఉంటుంది. ఈ ఫోన్ HDR10+ సపోర్ట్ తో మరియు 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో అద్భుతమైన విజువల్స్ అందిస్తుంది. ఈ లేటెస్ట్ ఫోన్ గూగుల్ యొక్క లేటెస్ట్ Tensor G5 (TSMC 3nm) ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఇది కాకుండా Titan M2 సెక్యూరిటీ కో ప్రాసెసర్, 12 జీబీ LPDDR5X ర్యామ్ మరియు 256 జీబీUFS 4.0 స్టోరేజ్ వంటి అదనపు వివరాలు కూడా కలిగి ఉంటుంది. ఈ గూగుల్ ఫోన్ Android 16 తో పని చేస్తుంది.

పిక్సెల్ 10 ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఇందులో 48MP ప్రైమరీ వైడ్, 10.8MP (5×) టెలిఫొటో మరియు 13 MP అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా మరియు ముందు 10.5MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 60FPS వద్ద చాలా స్థిరమైన వీడియోలు మరియు గొప్ప ఫోటోలు అందిస్తుంది. ఇది టన్నుల కొద్దీ గూగుల్ పిక్సెల్ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4,970 mAh బ్యాటరీ, 29 W వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్ మరియు 15W Qi2 వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :