flipkart announced big discount on 200MP phone vivo V60e
vivo V60e స్మార్ట్ ఫోన్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ సూపర్ డీల్స్ అందించింది. ఇటీవల విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ బై బై 2025 సేల్ నుంచి అందించిన భారీ డీల్స్ తో కేవలం 25 వేల రూపాయల ధరలో మీకు లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 200MP జబర్దస్త్ కెమెరా, స్టన్నింగ్ డిజైన్ మరియు భారీ బ్యాటరీ వంటి మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది. కొత్త ఫోన్ కోసం సెర్చ్ చేస్తుంటే ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ డీల్ ని పరిశీలించవచ్చు.
వివో వి60e స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 29,999 ధరతో లాంచ్ అయ్యింది మరియు ఈరోజు కూడా ఇదే ప్రైస్ తో ఫ్లిప్ కార్ట్ నుంచి లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ మిడ్ వేరియంట్ రూ. 31,999 ధరతో మరియు హై ఎండ్ వేరియంట్ రూ. 33,999 ధరతో లిస్ట్ అయ్యాయి. ఈ ఫోన్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ రెండు డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఇందులో ఒకటి బ్యాంక్ డిస్కౌంట్ మరియు రెండోది ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్.
ఇక ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ను ఎంపిక చేసిన క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 2,500 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ ను ఎక్స్ చేంజ్ ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 2,500 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 24,999 రూపాయల స్టార్టింగ్ ప్రైస్ తో మీ సొంతం చేసుకోవచ్చు.
Also Read: Starlink Plan Price: ఇండియాలో శాటిలైట్ ఇంటర్నెట్ ప్లాన్ ధర విడుదల చేసిన ఎలాన్ మస్క్.!
ఈ వివో స్మార్ట్ ఫోన్ కెమెరా ప్రత్యేకమైన ఫోన్ మరియు ఇందులో 200MP మెయిన్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 50MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ కెమెరా గొప్ప జూమ్, 4K వీడియో రికార్డింగ్, 85mm క్లోజప్ పోర్ట్రైట్ ఫోటోగ్రఫీ మరియు AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ వివో ఫోన్ 6.77 ఇంచ్ క్వాడ్ కర్వుడ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది మరియు ఈ స్క్రీన్ లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, FHD+ మరియు HDR10+ రిజల్యూషన్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ ను మీడియాటెక్ 4nm చిప్ సెట్ Dimensity 7360-Turbo తో అందించింది మరియు దీనికి జతగా 8 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంటుంది. ఈ వివో ఫోన్ 6500 mAh బిగ్ బ్యాటరీ మరియు 90W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను వేగంగా చల్లబరిచే పెద్ద వేపర్ ఛాంబర్ కూలింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంటుంది. నీరు మరియు దుమ్మును తట్టుకునే IP68 అండ్ IP69 రేటింగ్ తో ఈ ఫోన్ వస్తుంది.