CMF Phone 1 లో 50MP Sony డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నట్లు కన్ఫర్మ్ చేసిన కంపెనీ.!

HIGHLIGHTS

CMF Phone 1 లో 50MP Sony డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నట్లు కన్ఫర్మ్

ఈ ఫోన్ ప్రోసెసర్, ర్యామ్, డిస్ప్లే మరియు కెమెరా వివరాలు బయటపెట్టింది

ఈ ఫోన్ తో పాటు స్మార్ట్ వాచ్ మరియు TWS బడ్స్ ను కూడా లాంచ్ చేస్తుంది

ప్రముఖ మొబైల్ బ్రాండ్ నథింగ్ సబ్ బ్రాండ్ CMF తీసుకొస్తున్న CMF Phone 1 లో 50MP Sony డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ డేట్ దగ్గర పడటంతో ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్ లతో కంపెనీ టీజింగ్ స్పీడ్ పెంచింది. ఇప్పటి వరకూ ఈ ఫోన్ ప్రోసెసర్, ర్యామ్, డిస్ప్లే మరియు కెమెరా వివరాలు బయటపెట్టింది. అంతేకాదు, ఈ ఫోన్ తో పాటు స్మార్ట్ వాచ్ మరియు TWS బడ్స్ ను కూడా లాంచ్ చేస్తుంది.

CMF Phone 1: టీజ్డ్ ఫీచర్స్

జూలై 8న CMF ఇండియాలో మూడు కొత్త ప్రొడక్ట్స్ ను విడుదల చేస్తోంది. ఇందులో సిఎంఎఫ్ ఫోన్ కూడా వుంది. ఈ ఫోన్ ను బడ్జెట్ ధరలో ఇండియన్ మార్కెట్లో విడుదల చేస్తుందని టాక్ వుంది. అందుకే, ఈ ఫోన్ లాంచ్ గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. దానికి తగినట్లుగానే కంపెనీ కూడా ఈ ఫోన్ టీజింగ్ ను చాలా కాలం నుండి కొనసాగిస్తోంది. అయితే, లాంచ్ డేట్ దగ్గర పడటంతో ఈ ఫోన్ కీలకమైన ఫీచర్స్ ను కూడా బయటపెడుతోంది.

CMF Phone 1 50MP Sony Camera

ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7300 5G చిప్ సెట్ తో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ లో 8GB ఫిజికల్ ర్యామ్ మరియు 8GB ర్యామ్ బూస్టర్ ఫీచర్ తో కలిపి 16GB ర్యామ్ అందుతుంది. ఈ ఫోన్ లో సూపర్ AMOLED డిస్ప్లే ఉన్నట్టు కూడా సిఎంఎఫ్ వెల్లడించింది. ఇవన్నీ ఇప్పటి వరకూ తెలిపిన విషయాలైతే, ఈ ఫోన్ లో 50MP సోనీ డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నట్లు కొత్తగా తెలిపింది.

Also Read: చవక ధరలో LG ThinQ సపోర్ట్ తో కొత్త QLED Smart Tv లాంచ్ చేసిన డైవా.!

ఈ ఫోన్ లో అందించిన కెమెరా మరియు సెటప్ ను తెలిపే ఇమేజ్ ను కూడా అందించింది. ఈ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ కెమెరా సెటప్ వివరాలు మరియు దీనికి జతగా ఉన్న LED ఫ్లాష్ లైట్ మరియు డిటాచబుల్ స్క్రూ కనిపిస్తున్నాయి. ఈ ఫోన్ తో పాటు Watch Pro 2 స్మార్ట్ వాచ్ మరియు Buds Pro 2 ఇయర్ బడ్స్ ను కూడా లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :