EPF రిజిస్టర్ మొబైల్ నంబర్ అప్డేట్ ఇలా చేస్తే సింపుల్ గా అయిపోతుంది

Raja Pullagura బై | పబ్లిష్ చేయబడింది 11 Jun 2021 12:49 IST
HIGHLIGHTS
  • ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) లో మొబైల్ నంబర్ అప్డేట్ చేయాలా

  • UAN లో మొబైల్ నంబర్ ఎలా మార్చాలి

  • ఆన్లైన్లో చాలా సింపుల్ గా చెయ్యొచ్చు.

EPF రిజిస్టర్ మొబైల్ నంబర్ అప్డేట్ ఇలా చేస్తే సింపుల్ గా అయిపోతుంది
EPF రిజిస్టర్ మొబైల్ నంబర్ అప్డేట్ ఇలా చేస్తే సింపుల్ గా అయిపోతుంది

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) లో మొబైల్ నంబర్ అప్డేట్ చేయాలా. మీ PF అకౌంట్ కి సంబంధించి మీకు అన్ని అవసరాలకు ముఖ్యంగా అవసరమైనది UAN నంబర్. UAN నంబర్ అంటే, యూనివర్సల్ అకౌంట్ నంబర్. ఇందులో, మీరు ఒకే UAN నంబర్ లో మీ అన్ని కంపెనీల EPF వివరాలు ఉంటాయి. అంటే, ఒకప్పుడు పనిచేసే కంపెనీ నుండి ఎంప్లాయి మరొక కంపెనీకి మారినప్పుడు వారి PF మారుతుంది మరియు పాత నంబర్ క్లోజ్ చేయ్యడం జరిగేది. అందుకే, ఒకే నంబర్ పైన జీవితాంతం అన్ని EPF లను అనుసంధానం చేసేలా ప్రభుత్వం ఈ UAN నంబర్ విధానం తీసుకొచ్చింది.

అయితే, సాధారణంగా మనం కొత్త నంబర్ తీసుకున్నప్పుడు లేదా పాత నంబర్ ను మార్చవలసి వచ్చినప్పుడు ఏమి చెయ్యాలో చాలా మందికి తెలియక పోవచ్చు. అందుకే, UAN లో మొబైల్ నంబర్  ను ఎలా అప్డేట్ లేదా చేంజ్ ఎలా చేయాలి అనే విషయాన్ని సవివరంగా చర్చిస్తున్నాను.

UAN లో మొబైల్ నంబర్ ఎలా మార్చాలి?

  • ముందుగా UAN మెంబర్ e-సేవ పోర్టల్ ఓపెన్ చెయ్యాలి
  • ఇక్కడ మీ UAN నంబర్ మరియు పాస్వర్డ్ తో లాగిన్ అవ్వండి
  • లాగిన్ అయిన తరువాత ఇక్కడ మీకు మైన్ పేజ్ కనిపిస్తుంది
  • మైన్ పేజీలో Manage అనే అప్షన్ కనిపిస్తుంది, దీని పైన నొక్కండి
  • ఇక్కడ మీరు Contact Details పైన నొక్కండి
  • ఇక్కడ మీకు మీ రిజిష్టర్ మొబైల్ నంబర్ క్రింద Change Mobile Number అప్షన్ కనిపిస్తుంది
  • ఇక్కడ Change Mobile Number పక్కన బాక్స్ పైన టిక్ చేయండి
  • వెంటనే మీకు కొత్త నంబర్ అప్డేట్ లేదా చేంజ్ చేయాల్సిన నంబర్ ఎంటర్ చేసి ఆధరైజ్ చేయండి.
Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

WEB TITLE

change or update of your epf mobile number is very easy

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

లేటెస్ట్ ఆర్టికల్స్ మొత్తం చూపించు

VISUAL STORY మొత్తం చూపించు