BSNL యొక్క రూ.186 ప్రీపెయిడ్ ప్లానుతో రోజుకు 3.5GB డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్
ప్రస్తుతం కొన్ని 3G ప్రీపెయిడ్ ప్లాన్ల పైన ఉచిత డేటాని ప్రకటించింది.
BSNL ఇప్పటి వరకూ 4G సేవలను అందించడంలో వెనుకబడి ఉన్నదన్న అపవాదునుండి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఈ ప్రభుత్వరంగ టెలికం సంస్థ, తన 3G సేవల పైన కూడ బాగానే ద్రుష్టి పెట్టినట్లు కనబడుతోంది. మంచి 4G సేవలను మరియు రీచార్జి ఆఫర్లను వినియోగదారులకు సిద్ధంచేసిన BSNL, ప్రస్తుతం కొన్ని 3G ప్రీపెయిడ్ ప్లాన్ల పైన ఉచిత డేటాని ప్రకటించింది.
Surveyఇందులోభాగంగా, అతితక్కువ ధరలో నెల రోజుల వ్యాలిడిటీతో వచ్చేటటువంటి రూ. 186 ప్రీపెయిడ్ ప్లానుతో చాల మంచి లాభాలను అందిస్తోంది. ఈ రూ. 186 ప్రీపెయిడ్ ప్లానుతో ముందుగా, రోజువారీ 1GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజువారీ 100SMS లను 28 రోజుల వ్యాలిడితో అందిస్తుండగా, ఇప్పుడు దీనిపైన 2.2GB డేటాని ఉచితంగా అందిస్తోంది.
అంటే, ఇప్పుడు ఈ రూ. 186 ప్రీపెయిడ్ ప్లానుతో 28 రోజుల చెల్లుబాటుకు గాను అన్లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ తో పాటుగా రోజూవారి 3.2GB డేటా మరియు రోజువారీ 100SMS లను అందిస్తోంది. అంటే, 28 రోజులకుగాను 90GB (89.6) డేటాని అందిస్తోంది. 4G స్పీడుతోకాకుండా, సాధారణ 3G స్పీడుతో ఎక్కువ డేటాని అందిస్తున్న వాటిలో ఉత్తమైన ఆఫర్లన్నీ కూడా BSNL మాత్రమే అందిస్తున్నదనడంలో ఎటువంటి సందేహంలేదని చెప్పొచ్చు. అయితే, ఈ అఫర్ కేవలం జూన్ 30 వ తేదీవరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile