BSNL యొక్క ఈ ప్రీపెయిడ్ ప్లానుతో డైలీ 2.2GB డేటా ఉచితం

Updated on 14-May-2019
HIGHLIGHTS

రూ. 186 ప్లానుతో ఏకంగా 2.2 GB రోజువారీ డేటాని ఉచితంగా అందుకోవచ్చు

ప్రభుత్వరంగ టెలికం సంస్థ అయినటువంటి BSNL, తన 3G సేవల పైన కూడ బాగానే ద్రుష్టి పెట్టినట్లు కనబడుతోంది. మంచి 4G సేవలను మరియు రీచార్జి ఆఫర్లను వినియోగదారులకు సిద్ధం చేసిన BSNL, ప్రస్తుతం కొన్ని 3G  ప్రీపెయిడ్ ప్లాన్ల పైన ఉచిత డేటాని ప్రకటించింది. ఇందులో భాగంగా, నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్ అయినటువంటి రూ. 186 ప్లానుతో ఏకంగా 3.2 GB రోజువారీ డేటాని అందించడం విశేషం.      

అతితక్కువ ధరలో నెల రోజుల వ్యాలిడిటీతో వచ్చేటటువంటి రూ. 186 ప్రీపెయిడ్ ప్లానుతో చాల మంచి లాభాలను అందిస్తోంది. ఈ రూ. 186 ప్రీపెయిడ్ ప్లానుతో ముందుగా, రోజువారీ 1GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజువారీ 100SMS లను 28 రోజుల వ్యాలిడితో అందిస్తుండగా, ఇప్పుడు దీనిపైన  2.2GB డేటాని ఉచితంగా అందిస్తోంది.

అంటే, ఇప్పుడు ఈ రూ. 186 ప్రీపెయిడ్ ప్లానుతో 28 రోజుల చెల్లుబాటుకు గాను అన్లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ తో పాటుగా రోజూవారి 3.2GB డేటా మరియు రోజువారీ 100SMS లను  అందిస్తోంది. అంటే, 28 రోజులకుగాను 90GB (89.6) డేటాని అందిస్తోంది. 4G స్పీడుతోకాకుండా, సాధారణ 3G స్పీడుతో ఎక్కువ డేటాని అందిస్తున్న వాటిలో ఉత్తమైన ఆఫర్లన్నీ కూడా BSNL మాత్రమే అందిస్తున్నదనడంలో ఎటువంటి  సందేహంలేదని చెప్పొచ్చు. అయితే, ఈ అఫర్ కేవలం జూన్ 30 వ తేదీవరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.                                     

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :