డిస్కౌంట్ తో 10 వేల కంటే తక్కువ ధరకే లభిస్తున్న POCO కొత్త 5G Phone.!

HIGHLIGHTS

Poco కొత్త 5G Phone ను డిస్కౌంట్ తో 10 కంటే తక్కువ ధరకే ఆఫర్ చేస్తోంది

ఇప్పుడు మరింత సరసమైన ధరకే POCO M6 5G అందుకోండి

ఈ ఫోన్ పైన Flipkart Axis Bank కార్డ్ 5% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది

POCO ఇండియాలో విడుదల చేసిన కొత్త 5G Phone ను డిస్కౌంట్ తో 10 కంటే తక్కువ ధరకే ఆఫర్ చేస్తోంది. అంటే, ఇప్పుడు 10 వేల రూపాయల ఉప బడ్జెట్ ధరలోనే ఈ కొత్త 5జి ఫోన్ ను మీ సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ లేటెస్ట్ 5జి ప్రోసెసర్, డిజైన్ మరియు ఫీచర్స్ తో మార్కెట్ లో అడుగుపెట్టింది. ఇటీవలే భారత మార్కెట్ లో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు మరింత సరసమైన ధరకే ఆఫర్ చేస్తోంది.

POCO new 5G Phone Price Cut

పోకో ఇటీవల బడ్జెట్ ధరలో విడుదల చేసిన కొత్త ఫోన్ పోకో ఎం6 5జి పైన పోకో రూ. 500 రూపాయల తగ్గింపును ప్రకటించింది. ఈ ఫోన్ ఎక్క బేసిక్ వేరియంట్ రూ. 10,499 రూపాయల ధరలో విడుదల అవ్వగా, కొత్తగా అందించిన డిస్కౌంట్ తో ఇప్పుడు రూ. 9,999 ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ యొక్క 6GB మరియు 8GB వేరియంట్స్ పైన కూడా ఈ తగ్గింపును అందించింది.

అందుకే, ఇప్పుడు పోకో ఎం6 5జి (6 GB RAM + 128 GB) వేరియంట్ రూ. 10,999 ధరతో, (8 GB RAM + 256 GB) వేరియంట్ రూ. 12,999 ధరతో లభిస్తున్నాయి. ఈ ఫోన్ Flipkart నుండి లభిస్తుంది మరియు ఈ ఫోన్ పైన Flipkart Axis Bank కార్డ్ 5% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

Also Read: Lava Yuva 3: చూడచక్కని డిజైన్ మరియు 128GB ఫాస్ట్ స్టోరేజ్ తో వస్తోంది.!

పోకో ఎం6 5జి ప్రత్యేకతలు

పోకో ఎం6 5జి స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ లేటెస్ట్ బడ్జెట్ 5జి ప్రోసెసర్ Dimensity 6100+ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 4GB / 6GB / 8GB RAM మరియు 128GB / 256 GB స్టోరేజ్ ఆప్షన్ లలో లభిస్తుంది. ఈ పోకో బడ్జెట్ ఫోన్ 6.74 ఇంచ్ బిగ్ డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ మరియు HD+ రిజల్యూషన్ తో కలిగి వుంది. ఈ ఫోన్ Android 13 OS తో MIUI 14 సాఫ్ట్ వేర్ పైన నడుస్తుంది.

poco m6 5g features

ఈ పోకో ఫోన్ లో వెనుక 50MP AI డ్యూయల్ రియర్ కెమేరా మరియు 5MP సెల్ఫీ కెమేరా ఉన్నాయి. ఇందులో సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్, వర్చువల్ ర్యామ్, 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు 18W ఫాస్ట్ ఛార్జ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :