Lava Yuva 3: చూడచక్కని డిజైన్ మరియు 128GB ఫాస్ట్ స్టోరేజ్ తో వస్తోంది.!
కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం Lava టీజింగ్ మొదలు పెట్టింది
Lava Yuva 3 ని త్వరలో లాంచ్ చేయబోతున్నట్లు టీజింగ్ మొదలు పెట్టింది
ఈ ఫోన్ ను అమేజాన్ ప్రత్యేకంగా తీసుకు వస్తోంది
Lava Yuva 3: కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం టీజింగ్ మొదలు పెట్టింది ఇండియన్ మొబైల్ బ్రాండ్ లావా. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లావా యువ 3 ని త్వరలో లాంచ్ చేయబోతున్నట్లు టీజింగ్ మొదలు పెట్టింది. ఈ ఫోన్ ను అమేజాన్ ప్రత్యేకంగా తీసుకు వస్తోంది మరియు అమేజాన్ ఇప్పటికే ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ మొదలు పెట్టింది.
SurveyLava Yuva 3:
లావా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లావా యువ 3 ఫోన్ లాంచ్ గురించి కంపెనీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుండి టీజింగ్ వివరాలను ట్వీట్ చేస్తోంది. ఈరోజు కొత్తగా విడుదల చేసిన టీజింగ్ ట్వీట్ నుండి ఈ ఫోన్ కలిగి కలిగి ఉండనున్న స్టోరేజ్ వివరాలను మరియు బేసిక్ ప్రైస్ ను వెల్లడించింది.
ఈ ఫోన్ కోసం అందించిన టీజింగ్ నుండి ఈ ఫోన్ 128GB UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ తో లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ కేవలం రూ. 6,799 రూపాయల నుండి ప్రారంభవుతుందని కూడా టీజింగ్ ద్వారా తెలిపింది. ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ ను 64GB స్టోరేజ్ తో అందిస్తున్నట్లు కూడా చెబుతోంది.
Maxx out on storage, one byte at a time!#Yuva3 – Coming soon#LavaMobiles #ProudlyIndian pic.twitter.com/Brh5JEOpqI
— Lava Mobiles (@LavaMobile) February 1, 2024
ఇక ఈ ఫోన్ లాంచ్ కోసం ముందుగా అందించిన టీజర్ ద్వారా, ఈ ఫోన్ ను వెనుక ట్రిపుల్ కెమేరా సెటప్, గొప్ప ఆకర్షణీయమైన డిజైన్, Type-C ఛార్జింగ్ పోర్ట్ తో తీసుకు రాబోతూన్నట్లు చూపిస్తోంది.
Time to level up your vibe!#Yuva3 – Coming Soon #LavaMobiles #ProudlyIndian pic.twitter.com/YW8DbwBQzU
— Lava Mobiles (@LavaMobile) February 1, 2024
ఈ ఫోన్ లాంచ్ కోసం మరింత సమయం వుంది కాబట్టి, ఈ ఫోన్ యొక్క మరిన్ని స్పెక్స్ ను టీజింగ్ ద్వారా అందించే అవకాశం ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile