IQOO 3 స్మార్ట్ ఫోన్ పైన భారీ ధర తగ్గింపు

IQOO 3 స్మార్ట్ ఫోన్ పైన భారీ ధర తగ్గింపు
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ యొక్క 4G మరియు 5G వేరియంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

రూ. 3000 రూపాయల అదనపు ఫ్లాట్ డిస్కౌంట్ ని కూడా అఫర్ చేస్తోంది.

భారతదేశంలో విడుదల చేసినటువంటి మొట్టమొదటి 5G స్మార్ట్  ఫోన్ ఇప్పుడు భారీగా ప్రైస్ కట్ అందుకుంది. ముందుగా, ఇండియాలో రూ. 38,990 ధరతో విడుదల చేయబడినటువంటి IQOO 3  స్మార్ట్ ఫోన్ ఇప్పుడు 4000 రుపాయల ప్రైస్ కట్ అందుకుని, రూ.34,990 రూపాయల ధరతో అమ్ముడవుతోంది.  ఈ స్మార్ట్ ఫోన్ యొక్క 4G మరియు 5G వేరియంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. 

అధనంగా, ICICI బ్యాంక్ యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల ద్వారా కొనేవారికి రూ. 3000 రూపాయల అదనపు ఫ్లాట్ డిస్కౌంట్ ని కూడా అఫర్ చేస్తోంది.                    

IQOO 3 5G : టాప్ -5 ఫీచర్లను

1. డిస్ప్లే

ఈ IQOO 3 5G స్మార్ట్ ఫోన్ 6.44 అంగుళాల పరిమాణం గల SuperAMOLED డిస్ప్లే 2400×1080 పిక్సెల్స్ రిజల్యూషన్ తో మరియు పంచ్ హోల్ డిజైనుతో అందించింది. ఇక దీని డిస్ప్లే యొక్క స్పెషల్ ఫీచర్ విషయానికి వస్తే, ఇది HDR 10+ కి సపోర్ట్ చేయగల పోలార్ వ్యూ డిస్ప్లేతో వస్తుంది. అంతేకాదు, ఇది 800 నుండి  మొదలుకొని కొన్ని ప్రత్యేకపరిస్థితుల్లో గరిష్టంగా 1200+ నిట్స్ బ్రైట్నెస్ వంటి గోప్ప ఫీచర్లతో వస్తుంది.                                         

2. ప్రాసెసర్

ఇక పర్ఫార్మెన్స్ పరంగా, క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 865 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇది A77 పెరఫార్మెన్స్  కోర్స్ తో గరిష్టంగా 2.84GHz క్లాక్ స్పీడ్ అందిస్తుంది. ఇందులో ఉన్న Adreno 650 GPU కారణంగా PUBG వంటి గేమింగ్ అల్ట్రా హై డెఫీనేషనుతో పాటుగా ఎటువంటి అంతరాయం లేకుండా గంటల తరబడి ఆడవచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇది 5G సపోర్టుతో వస్తుంది మరియు ఇది ఇండియాలో విడుదలైన రెండవ 5G స్మార్ట్ ఫోనుగా నిలుస్తుంది.

3. ర్యామ్ & స్టోరేజి

ఈ ఫోన్ను రెండు ర్యామ్ వేరియంట్ ఎంపికలతో ప్రకటించింది. అవి : 8GB ర్యామ్ +128GB స్టోరేజి, 8GB ర్యామ్ +128GB మరియు 12GB + 256GB స్టోరేజి వంటి మూడు వేరియంట్లు . వీటి ధరలు ఈ క్రింద చూడవచ్చు. అంతేకాదు, ఇది వేగవంతమైన LPDDR5 RAM మరియు UFS 3.1 

IQOO 3 5G : ధరలు

1. IQOO 3 5G : 8GB ర్యామ్ + 128GB స్టోరేజి : Rs.34,990/-

2. IQOO 3 5G : 8GB ర్యామ్ + 256GB స్టోరేజి : Rs.37,990/

3. IQOO 3 5G : 12GB ర్యామ్ + 256GB స్టోరేజి : Rs.44,990/

అయితే, ఇక్కడ గమనించాల్సిన విష్యం ఏమిటంటే, ఇక్కడ కేవలం హై ఎండ్ వేరియంట్ అయినటువంటి 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజి మాత్రమే 5G సపోర్టుతో వస్తుంది. మిగిలిన రెండు వేరియంట్లు కూడా 4G సపోర్టుతో వస్తాయి.       

4. కెమేరా

ఈ ఫోన్ లో వెనుక క్వాడ్ కెమెరా సెటప్పును అందించింది. ఈ క్వాడ్ కెమెరాలో, f/1.8 ఎపర్చర్ కలిగిన ఒక 48MP ప్రధాన కెమెరాని ఇంచింది. ఇక రెండవ కెమేరా గురించి చూస్తే, ఇది ఒక 13MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ మేమియు దీనికి జతగా 13MP (f/2. 46) టెలిఫోటో లెన్స్ (20Xజూమ్) మరియు నాలుగవ కెమేరాగా ఒక 2MP డెప్త్ సెన్సార్ ని కలిగి ఉంటుంది.  ఇక సెల్ఫీ కెమేరా కేమెరా విషయానికి వస్తే, ముందు పంచ్ హోల్ సెల్ఫీ కెమెరాతో ఈ ఫోన్ వస్తుంది. ఇందులో, ఒక 16MP(f/2.4) సెల్ఫీ కెమెరా ఇచ్చింది. ఈ కెమేరాతో మీరు సూపర్ సెల్ఫీ ఫోటోలు మరియు స్లో మోషన్ వీడియోలను తీయ్యోచ్చు మరియు ఫోటోలను అద్భుతంగా చిత్రీకరించవచ్చు.

5. బ్యాటరీ

ఈ IQOO 3 5G ఒక అతిపెద్ద 4,440mAh బ్యాటరీతో విడుదల చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ యొక్క బ్యాటరీని అత్యంత వేగవంతమైన 55W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో పాటుగా, బాక్స్ లోనే ఒక స్పీడ్ ఛార్జర్ కూడా అందించింది. ఈ అత్యంత వేగవంతమైన ఈ ఛార్జింగ్ టెక్నాలజీతో కేవలం 15 నిముషాల్లో 50% వరకూ బ్యాటరీని ఛార్జ్ చెయ్యొచ్చు.                

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo