VIVO Z1X పైన భారీ డిస్కౌంట్

HIGHLIGHTS

గత సంవత్సరం, VIVO తన Z సిరీస్ నుండి  Z1x ను గొప్ప ట్రెండీ ఫీచర్లు మరియు ప్రీమియం లుక్స్ తో ఇండియాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక ట్రిపుల్ కెమేరా మరియు ఒక 32MP సెల్ఫీ కెమేరాతో వస్తుంది. ముఖ్యంగా ఇది ట్రిపుల్ రియర్ కెమేరాతో పాటుగా సూపర్ AMOLED FHD+ డిస్ప్లేతో మంచి వైవిధ్యమైన రంగులను అందిస్తుంది. ఇప్పుడు, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క 8GB ర్యామ్ వేరియంట్ పైన 4,000 రూపాయల భారీ డిస్కౌంట్ ని ప్రకటించింది.       

ముందుగా, వివో జెడ్ 1 ఎక్స్ యొక్క 8 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ఫ్యూజన్ బ్లూ కలర్ రూ .21,990 ధరతో ప్రవేశపెట్టబడింది. అయితే, ప్రస్తుతం దీని పైన ప్రకటించిన 4,000 రూపాయల డిస్కౌంట్ తరువాత ఇది కేవలం రూ.17,990 రూపాయల ధరతో అమ్ముడవుతోంది.   

వివో Z1x ధర

1.  6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ – Rs.15,990/-

2.  6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ – Rs.16,990/-

3. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ – Rs.17,990/-

వివో Z1x ధర  ఫీచర్లు మరియు ప్రత్యేకతలు

ఈ వివో Z1x మొబైల్ ఫోన్, ఒక 6.38-అంగుళాల FHD + స్క్రీన్‌ తో వస్తుంది. ఇది సూపర్ AMOLED డిస్ప్లే మరియు ఒక వాటర్‌డ్రాప్ నోచ్ తో వస్తుంది. ఈ మొబైల్ ఫోన్‌ లో, ఎగవంతమైనటువంటి ఒక స్నాప్ డ్రాగన్ 712 AIE ఆక్టా కోర్ ప్రాసెసర్ ని అందించింది. అదనంగా, ఇది 6GB/8GB RAM తో అనుసంధానం చెయ్యబడింది మరియు ఇది 64GB /128GB అంతర్గత స్టోరేజితో వస్తుంది. ఈ ఫోన్‌లో 4,500 mAh సామర్థ్యం గల పెద్ద బ్యాటరీ మరియు గరిష్టంగా 22.5 వాట్స్ వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. ఇందులో, గేమింగ్ మరియు మల్టి టాస్కింగ్ కోసం ప్రత్యేకంగా మల్టి టర్బోలను అందించారు.

ఇక ఫోటోగ్రఫీ విషయానికి వస్తే, ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందుతుంది. ఒక 48MP ప్రాధమిక సెన్సార్‌కి జతగా మరొక 8MP వైడ్ యాంగిల్ కెమెరా మరియు ఒక  2MP డెప్త్ సెన్సార్ కూడా లభిస్తుంది. ఇది కాకుండా, మీకు ఈ ఫోన్‌లో ఒక 32 MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీల కోసం అందించబడింది. ఈ ఫోన్, ఫన్ టచ్ OS స్కిన్ పైన ఆండ్రాయిడ్ 9 ఫై ఆధారితంగా నడుస్తుంది. ఇది కేవలం 0.48 సెకన్లలో ఫోన్ అన్లాక్ చేయగల ఒక ఇన్- డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సారుతో వస్తుంది. ఇది ఫ్యూజన్ బ్లూ మరియు ఫాంటమ్ పర్పల్ వంటి రెండు రంగుల ఎంపికలతో లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :