Big Discount: రియల్ మి పవర్ ఫుల్ 5G Phone పైన 14 వేల భారీ తగ్గింపు.!

HIGHLIGHTS

రియల్ మి పవర్ ఫుల్ 5G Phone పైన 14 వేల భారీ తగ్గింపు

అతి తక్కువ EMI ఆప్షన్ లను కూడా ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది

రూ. 14,000 రూపాయల భారీ తగ్గింపుతో కేవలం రూ. 23,999 రేటుకే లభిస్తోంది

Big Discount: రియల్ మి పవర్ ఫుల్ 5G Phone పైన 14 వేల భారీ తగ్గింపు లభిస్తోంది. 25 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో కొత్త ఫోన్ కొనాలని వెతుకుతున్న వారికి మరొక మొబైల్ ఆప్షన్ వచ్చి చేరింది. 25 వేల రూపాయల సెగ్మెంట్ లో ఇప్పటికే మార్కెట్ లో కొత్త ఫోన్ లు వచ్చి చేరుతుండగా, ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ ఫోన్ కూడా లిస్ట్ లో చేరింది.

Flipkart Big Discount Offer

రియల్ మి యొక్క GT సిరీస్ ఫస్ట్ ఫోన్ అయిన Realme GT 5G స్మార్ట్ ఫోన్ పైన ఈ బిగ్ డిస్కౌంట్ ఆఫర్ ను ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ చాలా ముందుగా విడుదలైన ఫోన్ అయినా కూడా ఫీచర్స్ మరియు స్పెక్స్ విషయంలో యెంత మాత్రము తీసిపోదు. ఈ ఫోన్ ను గతంలో రూ. 37,999 రూపాయల ప్రారంభ ధరతో విడుదల చేసింది.

అయితే, ఈ ఫోన్ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ నుండి రూ. 14,000 రూపాయల భారీ తగ్గింపుతో కేవలం రూ. 23,999 రూపాయల డిస్కౌంట్ రేటుకే లభిస్తోంది. ఈ ఫోన్ పైన మంచి ఎక్స్ ఛేంజ్ బోనస్ మరియు అతి తక్కువ EMI ఆప్షన్ లను కూడా ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది. మరి ఈ ధరలో ఈ ఫోన్ ను ఒక ఆప్షన్ గా ఎంపికగా చేసే ప్రత్యేకతలు ఏమున్నాయో కూడా చూద్దాం పదండి.

Also Read: iQOO Z9 5G: మతిపోగోట్టే డిజైన్ మరియు ఫీచర్స్ తో వస్తోంది.!

Realme GT 5G : ప్రత్యేకతలు

ఈ రియల్ మి 5జి ఫోన్ Qualcomm యొక్క వేగవతమైన ప్రోసెసర్ Snapdragon 888 తో పని చేస్తుంది. అంతేకాదు, ఈ పవర్ ఫుల్ చిప్సెట్ కి జతగా 8GB LPDDR5 RAM + 7GB డైనమిక్ ర్యామ్ ని మరియు 128GB (UFS 3.1) ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ఈ ఫోన్ గొప్ప పెర్ఫార్మెన్స్ ను అందిస్తుంది మరియు చాలా వేగంగా రెస్పాండ్ అవుతుంది.

Realme GT 5G Features (Big Discount)

ఈ రియల్ మి ఫోన్ 6.43 ఇంచ్ AMOLED డిస్ప్లేని FHD+ రిజల్యూషన్ మరియు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో కలిగి ఉంటుంది. ఇది 91% బాడీ టూ స్క్రీన్ రేషియో, 2.5D Glass మరియు 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. అయితే, ఈ డిస్ప్లే కేవలం 60Hz రిఫ్రెష్ రేట్ వరకూ మాత్రమే సపోర్ట్ చేస్తుండడం, ఒక చిన్న లోటు అవుతుంది.

కేమెరా పరంగా, ఈ ఫోన్ లో వెనుక 64MP (Sony IMX682) + 8MP వైడ్ + 2MP మ్యాక్రో (Omnivision) ట్రిపుల్ సెటప్ వుంది. ఈ ఫోన్ మెయిన్ కెమేరాతో 4K (at 60fps / 30fps) వద్ద వీడియో షూట్ చేయవచ్చు. ఈ ఫోన్ లో ముందు 16MP(SonyIMX471) సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈ ఫోన్ లో చాలా కెమేరా ఫిల్టర్లు మరియు ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఈ రియల్ మి 5జి స్మార్ట్ ఫోన్ లో Dolby Atmos మరియు Hi-Res సపోర్ట్ వుంది. అంతేకాదు, ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ 65W సూపర్ డార్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 4,500 mAh బ్యాటరీని కలిగి వుంది.

అయితే గుర్తుంచు కోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ ఫోన్ యొక్క స్టాక్ ఉన్నంత వరకూ మాత్రమే ఈ ఆఫర్ లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :