రూ. 15,000 ధరలో ఇండియాలోని టాప్-5 బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ (డిసెంబర్ 2021)

Updated on 18-Dec-2021
HIGHLIGHTS

ఇటీవల విడుదలైన బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో ఏది బెస్ట్

ఇండియాలోని టాప్-5 బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ (డిసెంబర్ 2021) లిస్ట్

ఈ ఫోన్స్ కేవలం 15,000 రూపాయల ధర పరిధిలోనే ఉంటాయి

ఇటీవల విడుదలైన బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో ఏది బెస్ట్ లేదా ఏది ఎంచుకోవాలి అనిఅలోచిస్తున్నారా? అందుకే, మీ ఎంపికను సరళం చేయడానికి ఇండియాలోని టాప్-5 బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ (డిసెంబర్ 2021) లిస్ట్ గురించి ఈరోజు అందిస్తున్నాను. వాస్తవానికి, ప్రస్తుతం బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ పరిధి బాగా విస్తరించింది మరియు కొన్ని స్మార్ట్ ఫోన్స్ ఫ్లాగ్ షిప్ ఫీచర్లను కూడా అఫర్ చేస్తున్నాయి. కాబట్టి, మేము వివిధ బ్రాండ్స్ నుండి తక్కువ ధరలో వచ్చిన బెస్ట్ ఫోన్‌ల జాబితాను ఒకచోట చేర్చాము మరియు ఈ ఫోన్స్ కేవలం 15,000 రూపాయల ధర పరిధిలోనే ఉంటాయి.

Moto G31 (Buy Here)

ప్రారంభ ధర: రూ.12,999

Moto G31 ఫోన్ 6.4 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే గరిష్టంగా 700 నైట్స్ బ్రైట్నెస్ అందించ గలదు మరియు పంచ్ హోల్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ వేగవంతమైన మీడియాటెక్ గేమింగ్ ప్రోసెసర్ Helio G85 SoC తో పనిచేస్తుంది. దీనికి జతగా 4GB/6GB ర్యామ్ మరియు 64GB/128GB స్టోరేజ్ లను అందిస్తుంది. ఈ ఫోన్ వెనుక 50MP క్వాడ్ ఫిక్షన్ రియర్ కెమెరాని కలిగివుంది. ఇక సెల్ఫీల కోసం పంచ్ హోల్ లో 13ఎంపి సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని  20W టర్బో పవర్ ఛార్జర్ తో కలిగివుంది. అద్భుతమైన మ్యూజిక్ మరియు మూవీ ఎక్స్ పీరియన్స్ కోసం ఈ ఫోన్ లో Dolby Atmos సౌండ్ టెక్నాలజీని కూడా తీసుకువస్తుంది. కాబట్టి, ఈ ఫోన్ ఈ ధరలో కంప్లీట్ ప్యాకేజ్ ఫోన్ గా మర్కెట్ లోకి వచ్చింది.

Infinix Hot 10s  (Buy Here)   

ప్రారంభ ధర: రూ.9,999

Infinix Hot 10s స్మార్ట్ ఫోన్ పెద్ద 6.82 -అంగుళాల HD + రిజల్యూషన్ గల డిస్ప్లే తో వుంటుంది మరియు ఇది 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శ్యాంప్లింగ్ రేట్ గల డిస్ప్లేమరియు NEG Dinorex  గ్లాస్ ప్రొటక్షన్ తో అందించింది. ఈ ఫోన్ మీడియా టెక్  హీలియో G85 గేమింగ్ ప్రాసెసర్ శక్తితో వస్తుంది మరియు 6GB RAM మరియు 64GB స్టోరేజ్ ఎంపికతో జత చేయబడుతుంది. అలాగే, ఈ ఫోన్ XOS  7.6 ఆధారితంగా ఆండ్రాయిడ్ 11 తో వస్తుంది.ఇన్ఫినిక్స్ హాట్ 10s లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ని 48MP మైన్ సెన్సార్ తో అందించింది.  ఈ ఫోన్ పెద్ద 6,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంటుంది. ఆడియో పరంగా కూడా ఇందులో DTS Surround సౌండ్ ని కూడా అందించింది. ఓవరాల్ గా చెప్పాలంటే తక్కువ ధరలో మంచి ఫోన్ అందుకోవచ్చు.

Realme 8 5G  (Buy Here)

ప్రారంభ ధర: రూ.15,399

Realme 85G ఫోన్ 6.5 అంగుళాల  FHD+ డిస్ప్లేని పంచ్ హోల్ డిజైనుతో కలిగి వుంటుంది. ఈ డిస్ప్లే యొక్క అధనపు ఫీచర్ల గురించి చూస్తే, ఇది 90Hz రిఫ్రెష్ రేటుతో వస్తుంది. అంతేకాదు, ఇది గరిష్టంగా 600 నిట్స్ బ్రైట్నెస్ అందించగలదు. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 700 5G ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇది 7nm ప్రొడక్షన్ ప్రొసెసర్ తో గరిష్టంగా 2.2GHz క్లాక్ స్పీడ్ అందిస్తుంది. ఇందులో ఉన్న ARM Mali-G57 GPU కారణంగా గ్రాఫిక్స్ కూడా బాగుంటాయి. Realme ఈ ఫోన్ లో వెనుక 48MP నైట్ స్కెప్ ట్రిపుల్ కెమెరా సెటప్పును అందించింది. Realme 8 5G స్మార్ట్ ఫోన్ 5,000mAh బ్యాటరీని వేగవంతమైన 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో కలిగివుంది.

POCO M3 Pro 5G (Buy Here)

ప్రారంభ ధర: రూ.14,499

POCO M3 Pro 5G స్మార్ట్ ఫోన్ 6.5-అంగుళాల FHD + రిజల్యూషన్ డిస్ప్లే తో వుంటుంది మరియు ఇది 90 Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC తో వస్తుంది, ఇది 6GB RAM వరకు మరియు 128GB వరకు స్టోరేజ్ తో జతగా వస్తుంది. ఇందులోని కెమెరా సెటప్, వెనుక భాగంలో ట్రిపుల్-లెన్స్ సెటప్ ఉంది. ఇందులో ఎఫ్ / 1.79 ఎపర్చర్‌ తో 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంటుంది. సెల్ఫీల కోసం, మూవీ ఫ్రేమ్ వంటి ఫీచర్లకు మద్దతునిచ్చే8 మెగాపిక్సెల్ లెన్స్ ఉంది.ఈ పోకో ఎం 3 ప్రో 5 జి స్మార్ట్ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతునిచ్చే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో అందించబడింది.

Redmi 10 Prime (Buy Here)

ప్రారంభ ధర: రూ.12,499

రెడ్‌మి 10 ప్రైమ్ స్మార్ట్ ఫోన్  6.5 ఇంచ్ Full-HD+ రిజల్యూషన్ డిస్ప్లే మరియు 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. ఈ ఫోన్ మీడియాటెక్ లేటెస్ట్ ఫాస్ట్ ప్రోసెసర్ Helio G88 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 6GB ర్యామ్ శక్తితో పనిచేస్తుంది. ఇది రీడింగ్ మోడ్ 3.0 తోవస్తుంది. ఈ ఫోన్ Android 11 ఆధారితంగా MIUI 12.5 స్కిన్ పైన పనిచేస్తుంది. ఇందులో 50MP ప్రధాన కెమెరా మరియు జతగా 8ఎంపి అల్ట్రా వైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో మరియు డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందుభాగంలో సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని కలిగి వుంది. రెడ్‌మి 10 ప్రైమ్ ఫోన్ లో 18W ఫాస్ట్ ఛార్జింగ్ కి మద్దతునిచ్చే 6,000 బిగ్ బ్యాటరీ కూడా వుంది. 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :