10 వేల ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ కోరుకునే వారికోసం తగిన లిస్ట్ ఈరోజు ఇక్కడ అందిస్తున్నాను. ఈ లిస్ట్ లో అందించిన ఫోన్లు విశ్వసనీయమైన పెర్ఫార్మెన్స్ తో పాటుగా ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తాయి. ఈ ఫోన్లు మీరు ఆశించే బడ్జెట్ లోనే మీకు తగిన ఫీచర్లు మరియు స్పెక్స్ తీసుకువస్తాయి. మీ బడ్జెట్ లో మీరు కోరుకునే కెమెరా, డిస్ప్లే మరియు బ్యాటరీ వంటి ముఖ్యమైన డిటైల్స్ ఈ ఫోన్ల సొంతం. మరింకెందుకు ఆలశ్యం 10 వేల ధరలో Top 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏమిటో చూసేద్దాం పదండి.
Survey
✅ Thank you for completing the survey!
Redmi 10
రెడ్ మీ 1ఓ స్మార్ట్ ఫోన్ 10 వేల రూపాయల సెగ్మెంట్ లో విశ్వసనీయమైన పర్ఫార్మెన్స్ మరియు బిగ్ బ్యాటరీ తో వచ్చే ఫోన్ గా నిలుస్తుంది. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 680 SoC మరియు 6,000 mAh హెవీ బ్యాటరీ వంటి ప్లస్ పాయింట్స్ ను కలిగి వుంది. Check Price Here
మోటోరోలా బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మోటో జి22, కేవలం 10 వేల రూపాయల ధరలో స్టాక్ ఆండ్రాయిడ్ కోరుకునే వారికి గొప్ప అప్షన్. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, మంచి బ్యాటరీ లైఫ్ గల బిగ్ 5,000mAh బ్యాటరీ మరియు 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. Check Price Here
Infinix Hot 12 Play
ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్రో కూడా దాదాపుగా రెడ్ మి 10 వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు 10 వేల రూపాయల సెగ్మెంట్ లో గొప్ప ఫోన్ గా నిలుస్తుంది. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్ కలిగిన బిగ్ 6,000mAh బ్యాటరీ మరియు డీసెంట్ పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. Check Price Here
Poco C3
10 వేల రూపాయల ధరలో పోకో C3 స్మార్ట్ ఫోన్ ను విశ్వసనీయమైన పెర్ఫార్మెన్స్ మరియు బిగ్ 5,000 mAh బ్యాటరీ కలిగిన డీసెంట్ ఎంట్రీ లెవల్ ఫోన్ గా నిలుస్తుంది. ఈ ఫోన్ మంచి బిల్డ్ క్వాలిటీ మరియు గొప్ప బ్యాటరీ లైఫ్ తో ఉంటుంది. Check Price Here
Realme Narzo 30A
10 వేల రూపాయల బడ్జెట్ ధరలో గేమింగ్ మరియు మల్టీ టాస్కింగ్ కోసం ఫోన్ చూసేవారికి ఇది గొప్ప ఎంపిక అవుతుంది. ఈ ఫోన్ Helio G85 SoC, పెద్ద డిస్ప్లే మరియు హెవీ 6,000 mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో వస్తుంది. Check Price Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile