Best 5G Mobile Offer: కూపన్ ఆఫర్ తో చవక ధరకే లభిస్తున్న Poco 5G ఫోన్.!

HIGHLIGHTS

లేటెస్ట్ 5జి ఫోన్ కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్

Poco 5G ఫోన్ పైన అమేజాన్ డిస్కౌంట్ కూపన్ ఆఫర్ అందించింది

తక్కువ ధరలో Best 5G Mobile Offer అందుకునే అవకాశం

Best 5G Mobile Offer: లేటెస్ట్ 5జి ఫోన్ కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్. బడ్జెట్ ధరలో ఇండియన్ మార్కెట్ లో అడుగుపెట్టిన లేటెస్ట్ Poco 5G ఫోన్ ఈరోజు అమేజాన్ నుండి డిస్కౌంట్ కూపన్ ఆఫర్ తో మరింత చవక ధరకే లభిస్తోంది. 10 వేల రూపాయల కంటే తక్కువ ధరలో ఈ స్మార్ట్ ఫోన్ అందుకునే అవకాశం ఈరోజు మీ ముందుంది. సేల్ ముగిసిన తరువాత కూడా అమేజాన్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ల పైన బెస్ట్ డీల్స్ మరియు ఆఫర్లను అందిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదనిపిస్తోంది.

Best 5G Mobile Offer

పోకో ఇండియాలో రీసెంట్ గా తీసుకు వచ్చిన కొత్త స్మార్ట్ ఫోన్ Poco M6 Pro స్మార్ట్ ఫోన్ పైన అమేజాన్ ఈరోజు బిగ్ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. రూ. 11,499 రూపాయల ప్రారంభ ధరతో విడుదలైన పోకో ఎం6 ప్రో స్మార్ట్ ఫోన్ ఈరోజు అమేజాన్ నుండి రూ. 1,000 రూపాయల డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. అమేజాన్ ఈ ఫోన్ ను రూ. 10,499 ధరతో లిస్ట్ చెయ్యడమే కాకుండా రూ. 500 రూపాయల డిస్కౌంట్ కూపన్ ను కూడా ఆఫర్ చేస్తోంది.

అంటే, అమేజాన్ ఆఫర్ చేస్తున్న డిస్కౌంట్ మరియు కూపన్ ఆఫర్ల ద్వారా పోకో ఎం6 ప్రో స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 9,999 రూపాయల ధరకే అందుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క 4GB + 128GB వేరియంట్ ను ఆఫర్ ధరతో అందుకోవచ్చు. అదే, 8GB + 256GB కలిగిన హై ఎండ్ వేరియంట్ అయితే కేవలం రూ. 12,999 రూపాయలకే లభిస్తుంది.

Also Read: First Sale: రేపు మొదటిసారిగా సేల్ కి రానున్న కొత్త బడ్జెట్ 16GB RAM స్మార్ట్ ఫోన్.!

Poco M6 Pro 5G Specs

ఇక పొకూ ఎం6 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ స్పెక్స్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ Snapdragon 4 Gen 2 ఫాస్ట్ ప్రొసెసర్ జతగా 4GB / 6GB/ 8GB RAM తో వస్తుంది. ఈ ఫోన్ 128GB మరియు 256GB హెవీ స్టోరేజ్ ఆప్షన్ లతో కూడా లభిస్తుంది. ఈ పోకో బడ్జెట్ 5జి ఫోన్ 8GB TurboRAM తో మరింత వేగంగా పని పని చేస్తుంది.

Poco M6 Pro 5G Specs

పోకో ఎం6 ప్రో స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో 50MP డ్యూయల్ కెమేరా సెటప్ మరియు ముందు 8MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది మరియు బాక్స్ లో 22.5W ఛార్జర్ కూడా లభిస్తుంది.

ఈ ఫోన్ ఆఫర్ గురించి సింపుల్ గా చెప్పాలంటే 10 వేల బడ్జెట్ ధరలో లభిస్తున్న బెస్ట్ 5జి ఫోన్ లలో ఒకటిగా చెప్పవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :