రూ. 15,000 ధరలో బెస్ట్ 5 స్మార్ట్ ఫోన్లు
ప్రస్తుతం బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను కొనేవారికంటే మిడ్ రేంజ్ ధరలో ధరలో స్మార్ట్ ఫోన్లను కొనేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతుంది.
ప్రస్తుతం బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను కొనేవారికంటే మిడ్ రేంజ్ ధరలో ధరలో స్మార్ట్ ఫోన్లను కొనేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతుంది. దాదాపుగా, అన్ని బాండ్స్ కూడా కేవలం మిడ్ రేంజ్ ధరలో ప్రీమియం స్పెక్స్ మరియు ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను తీసుకురావడంతో, అందరూ కూడా వాటివైపే ద్రుష్టి సారిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా ఈ మధ్యకాలంలో వచ్చిన రెడ్మి నోట్ 7 ప్రో, రియల్మీ 3 మరియు మోటో G7 పవర్ వంటి స్మార్ట్ ఫోన్లను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
Surveyఅందుకే, రూ. 15,000 ధరలో వినియోగ దారులు కోరుకునే అన్ని ప్రత్యేకతలతో మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి బెస్ట్ 5 సామ్రాట్ ఫోన్లను ఇప్పుడు చూద్దాం.
1.XIAOMI REDMI NOTE 7 PRO
ఇండియాలో మిడ్ రేంజ్ ధరలో ఒక 48MP ప్రధాన కెమేరా, అదీకూడా SONYIMX586 సెన్సారుతో ఒక స్మార్ట్ ఫోన్ను తీసుకొచ్చిన ఘనత, కేవలం షావోమి మాత్రమే సొంతం అని చెప్పొచ్చు. కేవలం, కెమేరా మాత్రమే కాదు ఒక స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసరుతో మంచి స్పీడ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 4GB మరియు 6GB వంటి ర్యామ్ ఎంపికలతో కూడా లభిస్తుంది. అలాగే, ఒక 4,000 బ్యాటరీతో ఒక రోజంతా కూడా చక్కగా సరిపోయేలా అందించారు. ( LINK )
2. REALME 3 PRO
రియల్మీ 3 ప్రో స్మార్ట్ ఫోన్, 1080 x 2340 రిజల్యూషన్ కలిగిన ఒక 6.3 అంగుళాల వాటర్ నోచ్ డిస్ప్లేతో ఉంటుంది. ఇది 90.8% స్క్రీన్-టూ-బాడీ రేషియో మరియు FHD+ రిజల్యూషన్ అందిస్తుంది. ఒక క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 710 ఆక్టా కోర్ ప్రొసెసరుకి జతగా అడ్రినో 616 మరియు 4GB మరియు 6GB ర్యామ్ శక్తితో వస్తుంది. 16MP కెమేరాకు జతగా f/2.4 అపర్చరు కలిగిన మరొక 5MP సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమేరాతో ఉంటుంది. ఈ ప్రాధాన 16MP కెమెరా ఒక SonyIMX519 సెన్సారుతో వస్తుంది.
3. SAMSUNG GALAXY M30
శామ్సంగ్ గెలాక్సీ M30 స్మార్ట్ ఫోన్ 2340 x 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.4 అంగుళాల సూపర్ AMOLED ఇన్ఫినిటీ – U డిస్ప్లేతో అందించబడుతుంది. అలాగే, ఇది ఒక ఎక్సినోస్ 7904 ఆక్టా కోర్ ప్రొసెసరుతో నడుస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ ఒక భారీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 4GB ర్యామ్ జతగా 64GB వేరియంట్ మరియు మరొక 6GB ర్యామ్ జతగా 128GB వేరియంట్తో వస్తుంది. వెనుక భాగంలో 13MP +5MP+5MP ట్రిపుల్ కెమేరా సేటప్పుతో వస్తుంది.
4. MOTO G7 POWER
మోటో నుండి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ మధ్య స్థాయి ధరలో ఒక 6.2 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 8MP సెల్ఫీ కెమెరా, 12MP సింగిల్ వెనుక కెమెరాతో వస్తుంది. కానీ ఇది గూగుల్ లెన్స్ తో వస్తుంది కాబట్టి మంచి బొకేహ్ షాట్లు కూడా తీసుకోవచ్చు మరియు మంచి క్లారిటీ ఫోటోలను తీస్తుంది. అలాగే, ఒక 3750mAh బ్యాటరీ వంటి లక్షణాలతో దాదాపు 13,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు.
5. HONOR 8X
ఈ స్మార్ట్ ఫోన్ మధ్య స్థాయి ధరలో 2340 x 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 5.5 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 16MP సెల్ఫీ కెమెరా, 20MP+2MP డ్యూయల్ వెనుక కెమెరా మరియు 3750mAh బ్యాటరీ వంటి లక్షణాలతో వస్తుంది. అంతేకాదు, ప్రస్తుతం దీనిపైన ధరను కూడా తగ్గించింది కాబట్టి కేవలం రూ. 12,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
