అసూస్ నుండి ఇప్పటి వరకూ మంచి అమ్మకాలను సాధించిన మరియు మంచి ప్రత్యేకతలతో అత్యంత ప్రజాధారణ పొందినటువంటి, అసూస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో M1, మాక్స్ ప్రో M2 మరియు మాక్స్ M2 స్మార్ట్ ఫోన్ల కోసం Android 9 Pie అప్డేట్ ను రోల్ ఔట్ చెయ్యడానికి, ఈ సంస్థ సర్వత్రా సిద్దమయ్యింది. తన వినియోగదారులు మరియు అభిమానులకు ఈ అప్డేటును చాల ఆలస్యంగా అందిస్తున్నాకూడా జెన్ ఫోన్ సిరిస్ ఫోన్లకు ఈ అప్డేట్ అందిస్తున్నది కాబట్టి దాదాపుగా అన్ని ఫిచర్లను కలిగిన ఈ ఫోన్లలో, కొరవడిన ఈ అప్డేట్ కూడా వచ్చి చేరుతుంది కాబట్టి, ఈ ఫోన్ సర్వత్రా సంపూర్ణంగా ఉంటుంది.
ఇక ఈ అప్డేట్ మాక్స్ ప్రో M2 విషయానికి వస్తే, ఈ అప్డేట్ దాదాపుగా 1.5GB పరిమితి గల ఫైల్ తో అందుతుంది మరియు ఇది మార్చి నెలకి సంబంధించిన అప్డేట్ ప్యాచ్ తో సహా అప్డేట్ చేయబడుతుంది. అలాగే, జేన్ ఫోన్ మాక్స్ M2 విషయానికి వస్తే, ఇది కూడా దాదాపుగా ఇంతే పరిమి ఫైల్ తో ఉంటుంది మరియు ఇది నేరుగా అందించబడుతుందని ఆశించవచ్చు.
ఈ అప్డేటుతో, తక్కువ ధరలో మంచి ఫీచర్లను కలిగివున్నాఈ స్మార్ట్ ఫోన్లు, మరొక మెట్టు ఎక్కుతాయి. అప్డేట్ చెక్ చెయ్యడం కోసం మీ ఫోన్లో Settings > System > System Updates లో నేరుగా తనిఖీ చేయడం ద్వారా ఈ అప్డట్ మీకు అందుబాటులో ఉన్నప్పుడు అప్డట్ చేసుకునే వీలుంటుంది. ఈ అప్డేట్ అందుకున్న తరువాత ప్రస్తుతం ట్రెండీగా నడుస్తున్న అనేక కొత్త ఫిచర్లతో, మీ ఫోన్ మళ్ళీ కొత్త కళను సంతరించుకుంటుంది.