దీపావళి సందర్భంగా స్మార్ట్ ఫోన్ల పైన భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ASUS సంస్థ

Updated on 21-Oct-2019
HIGHLIGHTS

అక్టోబరు 21 నుండి 25 తేదీ వరకూ జరగనున్న'ఫ్లిప్ కార్ట్ బిగ్ దీవాళీ సేల్' నుండి మాత్రమే అందిస్తున్నట్లు తెలిపింది.

ఈ దీపావళి సందర్భంగా, ASUS సంస్థ తన కొన్ని స్మార్ట్ ఫోన్ల పైన భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. అంతేకాదు, ఈ ఆఫర్లను Flipkart కార్ట్ భాగస్వామ్యంతో అందిస్తోంది. అంటే, ఈరోజు నుండి మొదలైన 'ఫ్లిప్ కార్ట్ బిగ్ దీవాళీ సేల్' నుండి ఈ ఆఫర్లను అందిస్తోంది. ఇక ఆఫర్ల విషయానికి వస్తే, అసూస్ కొత్తగా తీసుకొచ్చినటువంటి Asus 6Z తో పాటుగా, అనేకమైన ASUS స్మార్ట్ ఫోన్ల పైన భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. అయితే ఈ డిస్కౌంట్ కేవలం అక్టోబరు 21 నుండి 25 తేదీ వరకూ జరగనున్న'ఫ్లిప్ కార్ట్ బిగ్ దీవాళీ సేల్' నుండి మాత్రమే అందిస్తున్నట్లు తెలిపింది.    

ఇందులో భాగంగా, ASUS 6Z యొక్క అన్ని వేరియట్ల పైన ఏకంగా 4,000 రూపాయల ఫ్లాట్ డిస్కౌంట్ ప్రకటించింది. అంతేకాదు, ASUS 6Z స్మార్ట్ ఫోన్ను ప్రీ ఆర్డర్ ద్వారా కొనుగోలు చేసేవారికి 1, 000 రుపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.  అలాగే, ASUS 6Z యొక్క 6GB/64GB వేరియట్ పైన 5,000 రూపాయలు, 6GB/128GB వేరియట్ పైన 6,000 రూపాయలు మరియు 8GB/256GB వేరియట్ పైన అత్యధికంగా 7,000 రూపాయలు డిస్కౌంట్ ప్రకటించింది. 

ఇక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల విషయానికి వస్తే, జెన్ ఫోన్ మ్యాక్స్ M2  వేరియంట్ల పైన 1,000 రూపాయల ఫ్లాట్ డిస్కౌంట్ మరియు జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో M1 యొక్క అని వేరియంట్ల పైన 500 రూపాయల ఫ్లాట్ డిస్కౌంట్ ను కూడా ప్రకటించింది. వీటితో పాటుగా, SBI డెబిట్ మరియు క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. బజాజ్ ఫైన్ సర్వ్  మరియు ఇతర బ్యాంకుల డెబిట్/ వ్రేడిట్ కార్డులతో 3 నెలల మరియు 6 నెలల EMI ఎంపికలతో కొనేవారికి  No Cost EMI అప్షన్ కూడా వుంది.                            

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :