SD 845 చిప్సెట్ తో వచ్చిన ASUS 5Z సగం ధరకే అమ్ముడుకానుంది.

Updated on 27-Nov-2019
HIGHLIGHTS

మరింత తక్కువ ధరకే ఈ ఫాంను మీ సొంతం చేసుకోవచ్చు.

గత సంవత్సరం, అసూస్ తన ఫ్లాగ్‌ షిప్ స్మార్ట్ ఫోన్లయినటువంటి, అసూస్ 5 జెడ్ స్మార్ట్‌ ఫోన్ను ఇండియాలో విడుదల చేసింది. ముఖ్యంగా, ఈ ఫోన్ ఒక స్నాప్  డ్రాగన్ 845 చిప్సెట్ తో తీసుకువచ్చింది. అయితే, గతేడాది రూ .29,999 వద్ద లాంచ్ చేసిన ఫోన్ యొక్క ధరను డిసెంబరు 1 నుండి ప్రారంభం చెయ్యనున్న ఫ్లిప్ కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ ద్వారా సగానికి సగం వరకూ తగ్గిస్తోంది. ఈ ఫోన్‌ పైన ఏకంగా 48% డిస్కౌంట్ ని ప్రకటించిం,కేవలం రూ.15,999 ధరకే అమ్ముడుచేయనున్నట్లు చూపిస్తోంది.అధనంగా, ఈ సేల్ నుండి HDFC బ్యాంక్ క్రెడి లేదా డెబిట్ కార్డుతో ఈఫోన్ను కొనేవారికి 10% తక్షణ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. అంటే, మరింత తక్కువ ధరకే ఈ ఫాంను మీ సొంతం చేసుకోవచ్చు.    

అసూస్ 5Z ప్రత్యేకతలు

ఈ స్మార్ట్ ఫోన్, అత్యధికంగా 90% బాడీ టూ స్క్రీన్ రేషియో కలిగి 2246X1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.2 అంగుళాల FHD + సూపర్ IPS+ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ ఒక స్నాప్ డ్రాగన్ 845 ఆక్టా కోర్ ప్రోసెసరుతో అందించబడింది. ఈ ప్రొసెసరుకు జతగా 6/8GB ర్యామ్ మరియు 256GB  వరకూ స్టోరేజితో  అందించబడింది. ఈ అసూస్ 5Z,  మరింత ఛార్జింగ్ వేగాన్ని అందించగల Quick Charge 3.0 సపోర్టు కలిగిన ఒక పెద్ద 3,500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

ఇక కెమెరా విభాగానికి వస్తే, అసూస్ 5Z వెనుక మరియు ముందుకు మార్చుకోగలిగేలా ఉండే ఒక 12MP + 8MP డ్యూయల్ కెమెరాతో వస్తుంది. ఇంకా ఈ ఫోను కెమెరా ఒక పెద్ద F1.8 ఎపర్చరు లెన్స్ తో ఉంటుంది. ఇది చీకటిలో కూడా ప్రకాశవంతమైన ఫోటోలను తీస్తుంది. ఈ 12MP కెమెరా ఒక Sony IMX363 సెన్సారుతో వస్తుంది. ఇక రెండవ కెమేరా విషయానికి వస్తే, ఇది 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమేరా ని ఇచ్చారు. ఇక సెల్ఫీ కెమేరా విషయానికి వస్తే, ముందు ఒక 8MP సెల్ఫీలే కెమేరాని అందించారు.   

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :