ఆపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ సిరీస్ iPhone 13 సిరీస్ లాంచ్ తరువాత ఐఫోన్ 11 మరియు ఐఫోన్ 12 సిరీస్ ఫోన్ల రేట్లలో భారీ తగ్గింపు ప్రకటించింది. ఎప్పటిలాగానే ఆపిల్ తన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ పాత సిరీస్ ఫోన్ల పైన భారీ తగ్గింపునే అందించింది. ఈ కొత్త ధరలను ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ మరియు ఐఫోన్ 11 లకు వర్తింప చేసింది.
కొత్తగా అందించిన ప్రైస్ కట్ తరువాత కొత్త ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
MODEL | OLD PRICE | NEW PRICE |
iPhone 11 64GB | Rs 54,900 | Rs 49,900 |
iPhone 11 128GB | Rs 59,900 | Rs 54,900 |
IP 12 mini 64GB | Rs 69,900 | Rs 59,900 |
IP 12 mini 128GB | Rs 74900 | Rs 64,900 |
IP 12 mini 256GB | Rs 84,900 | Rs 74,900 |
iPhone 12 64GB | Rs 79,900 | Rs 65,900 |
iPhone 12 128GB | Rs 84,900 | Rs 70,900 |
iPhone 12 256GB | Rs 94,900 | Rs 80,900 |
కొత్తగా సూచించిన ధరలు చాలా ఆకర్షణీయంగా ఉన్నా కూడా వచ్చే నెల మొదలుకానున్న పండుగ సీజన్ నుండి మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లతో ఇంకా తక్కువ ధరకే పొందేవీలుంది.
ఇక కొత్తగా ప్రకటించిన ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్ ఫోన్ల ధర విషయానికి వస్తే, Apple iPhone 13 Mini యొక్క 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ కోసం రూ. 69,900 ధర, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ .79,900 మరియు 512GB స్టోరేజ్ ఆప్షన్ కోసం రూ .99,900 ధర నిర్ణయించింది.
ఐఫోన్ 13 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ కోసం రూ. 79,900 ధర, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ .89,900 మరియు 512GB స్టోరేజ్ ఆప్షన్ కోసం రూ .1,09,900 ధర నిర్ణయించింది.
ఐఫోన్ 13 ప్రో 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ కోసం రూ. 1,19,900 ధర, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ .1,29,900 మరియు 512GB స్టోరేజ్ ఆప్షన్ కోసం రూ .1,49,900 ధర మరియు 1TB స్టోరేజ్ వేరియంట్ కోసం రూ .1,69,900 ధరను నిర్ణయించింది.
ఇక ఈ సిరీస్ లో హై ఎండ్ ఫోన్ అయిన ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ కోసం రూ. 1,29,900 ధర, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ .1,39,900 మరియు 512GB స్టోరేజ్ ఆప్షన్ కోసం రూ .1,59,900 ధర మరియు 1TB స్టోరేజ్ వేరియంట్ కోసం రూ .1,79,900 ధరను నిర్ణయించింది.