Apple iPhone 13 Series ఇండియాలో అధికారికంగా విడుదల చెయ్యబడింది. ఈ ఆపిల్ 13 సిరీస్ నుండి ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో మరియు ఐఫోన్ 13 ప్రో మాక్స్ లను లాంచ్ చేసింది. అత్యాధునికమైన టెక్నాలజీతో ఈ లేటెస్ట్ ఆపిల్ ఫోన్లను అందించినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ కొత్త iPhone లకు అద్భుతమైన కొత్త కెమెరా సిస్టం మరియు చాలా శక్తివంతమైన A15 బయోనిక్ చిప్సెట్ లను జోడించింది మరియు డిస్ప్లే పరంగా కూడా మంచి మెరుగుదల వుంది. ఈ ఫోన్ల గురించి వివరణాత్మకంగా తెలుసుసుకుందాం.
Apple iPhone 13 Mini యొక్క 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ కోసం రూ. 69,900 ధర, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ .79,900 మరియు 512GB స్టోరేజ్ ఆప్షన్ కోసం రూ .99,900 ధర నిర్ణయించింది.
ఐఫోన్ 13 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ కోసం రూ. 79,900 ధర, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ .89,900 మరియు 512GB స్టోరేజ్ ఆప్షన్ కోసం రూ .1,09,900 ధర నిర్ణయించింది.
ఐఫోన్ 13 ప్రో 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ కోసం రూ. 1,19,900 ధర, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ .1,29,900 మరియు 512GB స్టోరేజ్ ఆప్షన్ కోసం రూ .1,49,900 ధర మరియు 1TB స్టోరేజ్ వేరియంట్ కోసం రూ .1,69,900 ధరను నిర్ణయించింది.
ఇక ఈ సిరీస్ లో హై ఎండ్ ఫోన్ అయిన ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ కోసం రూ. 1,29,900 ధర, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ .1,39,900 మరియు 512GB స్టోరేజ్ ఆప్షన్ కోసం రూ .1,59,900 ధర మరియు 1TB స్టోరేజ్ వేరియంట్ కోసం రూ .1,79,900 ధరను నిర్ణయించింది.
ఐఫోన్ 13 ప్రో మరియు ప్రో మ్యాక్స్ రెండు ఫోన్లు ముందు మరియు వెనుక గొరిల్లా గ్లాస్ తో జతచేయబడిన స్టెయిన్ లెస్ స్టీల్ చట్రాన్ని కలిగి ఉన్నాయి. ఈ రెండు ఫోనులు కూడా IP68 రేటింగ్ తో వస్తాయి. అంటే, ఇవి దుమ్ము మరియు నీటి నిరోధకతను కలిగి ఉన్నాయి. ఈ రెండు ఫోన్లు కూడా గ్రాఫైట్, గోల్డ్, సిల్వర్ మరియు సియెర్రా బ్లూ వంటి నాలుగు అందమైన కలర్ అప్షన్ లో లభిస్తాయి. ఈ రెండు ఫోన్లు కూడా 20W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 15W MagSafe వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగివున్నాయి.
ఐఫోన్ 13 ప్రో 6.1 ఇంచ్ సూపర్ రెటినా XDR ProMotion డిస్‌ప్లేను కలిగి ఉంది మరియు ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో (2532 x 1170) పిక్సెల్స్ రిజల్యూషన్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ డిస్ప్లే HDR10, Dolby Vision లకు సపోర్ట్ ఉంది మరియు స్క్రాచ్-రెసిస్టెంట్ సిరామిక్ గ్లాస్ ని కూడా ఆపిల్ ఈ ఫోన్లలో అందించింది. ఈ రెండు ఫోన్లు కూడా A15 బయోనిక్ చిప్ శక్తితో పనిచేస్తాయి.
ఇక కెమెరా పరంగా, ఐఫోన్ 13 ప్రో మరియు ఐఫోన్ 13 ప్రో మాక్స్ రెండూ ఫోన్లు కూడా సెన్సార్-షిఫ్ట్ OIS(ఆప్టిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్) f/1.5 ఎపర్చర్‌తో 12MP ప్రధాన కెమెరా, 3 X ఆప్టికల్ జూమ్ కలిగిన 12 MP టెలిఫోటో కెమెరా, 12 MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 3D LiDAR సెన్సార్ లను కలిగి ఉన్నాయి. ఈ రియర్ కెమెరా 4K UHD లో 60FPS వరకు Dolby Vision HDR, 10-bit HDR, ProRes మరియు మరిన్ని ఫీచర్లతో రికార్డ్ చేయగలవు. ముందు భాగంలో, ఫేస్ ఐడితో పాటు 12MP సెల్ఫీ కెమెరా ఉంది.