Apple iPhone Air launched as thinnest iPhone ever
Apple iPhone Air స్మార్ట్ ఫోన్ ఎట్టకేలకు ఈరోజు లాంచ్ అయ్యింది. యాపిల్ నిర్వహించిన బిగ్ ఈవెంట్ నుంచి ఈ ఫోన్ ను లాంచ్ చేసింది. నిన్నటి వరకు కేవలం రూమర్స్ లో మాత్రమే నిలిచిన ఈ ఫోన్ ఎట్టకేలకు ఇప్పుడు సాక్షాత్కార మయ్యింది. ఆపిల్ ఈ ఫోన్ ను అనుకున్న దానికంటే థిన్ డిజైన్ తో లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ ఐఫోన్ ధర మరియు కంప్లీట్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.
ఈ ఆపిల్ ఐఫోన్ సెప్టెంబర్ 19వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుంది. సెప్టెంబర్ 12వ తేదీ సాయంత్రం 5:30 నుంచి ఈ ఫోన్ ప్రీ ఆర్డర్ స్లాట్ ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ ప్రైస్ వివరాలు ఇక్కడ చూడవచ్చు.
ఆపిల్ ఐఫోన్ ఎయిర్ (256 జీబీ) ధర : రూ. 1,19,900
ఆపిల్ ఐఫోన్ ఎయిర్ (512 జీబీ) ధర : రూ. 1,39,900
ఆపిల్ ఐఫోన్ ఎయిర్ (1 టీబీ) ధర : రూ. 1,59,900
ఐఫోన్ ఎయిర్ ఫోన్ స్కై బ్లూ, లైట్ గోల్డ్, క్లౌడ్ వైట్ మరియు స్పేస్ బ్లాక్ నాలుగు రంగుల్లో లభిస్తుంది.
ఆపిల్ ఐఫోన్ ఎయిర్ ను ఐఫోన్ చరిత్రలో అత్యంత థిన్ ఫోన్ గా లాంచ్ చేసింది. ఈ ఫోన్ చాలా సన్నగా ఉన్నా కూడా గట్టిగా ఉండడానికి వీలుగా టైటానియం ఫ్రేమ్ మరియు సిరామిక్ 2 జతగా మంచి పటిష్టమైన డిజైన్ తో అందించింది. ఈ ఫోన్ ను కూడా శక్తివంతమైన A19 Pro chip తో లాంచ్ చేసింది. ఇది చాలా పవర్ ఫుల్ చిప్ సెట్ మరియు భారీ 1TB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.5 ఇంచ్ సూపర్ రెటీనా XDR డిస్ప్లే కలిగి ఉంటుంది మరియు ఈ స్క్రీన్ ప్రో మోషన్ టెక్నాలజీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో వెనుక 48MP ఫ్యూజన్ సింగల్ రియర్ కెమెరా మరియు ముందు 18MP సెంటర్ స్టేజ్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఐఫోన్ సూపర్ హై రిజల్యూషన్ ఫోటోలు మరియు 60 fps 4K Dolby Vision వీడియో సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ జనరేషన్ ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ మరియు 2x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆపిల్ ఇంటెలిజెన్స్ ఎమర్జెన్సీ SOS మరియు క్రాష్ డిటెక్షన్ ఫీచర్స్ తో వస్తుంది.
Also Read: Apple iPhone 17 Pro అండ్ 17 Pro Max ధర మరియు కంప్లీట్ ఫీచర్స్ తెలుసుకోండి.!
ఈ ఫోన్ లో USB‑C ఛార్జ్ పోర్ట్, ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు 27 గంటల వీడియో ప్లే బ్యాక్ అందించే పవర్ ఫుల్ బ్యాటరీ కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఫోన్ ఇప్పటి వరకు వచ్చిన ఐఫోన్ లలో విలక్షణమైన డిజైన్ కలిగిన ఫోన్ గా కనిపిస్తుంది మరియు చాలా స్లీక్ గా ఉంటుంది.