Apple iPhone 16e: యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ బడ్జెట్ ఫోన్ వచ్చేసింది.!

Updated on 20-Feb-2025
HIGHLIGHTS

యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ బడ్జెట్ ఫోన్ యూ లాంచ్ చేసింది

Apple iPhone 16e ను ఇంటెలిజెన్స్ మరియు డ్యూరబుల్ డిజైన్ తో అందించింది

ఈ యాపిల్ కొత్త ఫోన్ Pre-Order రేపటి నుంచి ప్రారంభం అవుతాయి

Apple iPhone 16e: గత సంవత్సరం యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ నుంచి అన్ని ప్రీమియం ఫోన్ లను విడుదల చేయగా, ఇప్పుడు ఈ సిరీస్ బడ్జెట్ ఫోన్ ఐఫోన్ 16e ని కూడా లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను కూడా యాపిల్ ఇంటెలిజెన్స్ మరియు డ్యూరబుల్ డిజైన్ తో అందించింది. ఈ యాపిల్ కొత్త ఫోన్ Pre-Order రేపటి నుంచి ప్రారంభం అవుతాయి. మరి ఈ ఫోన్ రేట్లు మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Apple iPhone 16e: ప్రైస్ లిస్ట్

యాపిల్ ఈ ఫోన్ ను మూడు స్టోరేజ్ వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఇందులో బేసిక్ 128GB వేరియంట్ ను రూ. 59,900 ప్రైస్ ట్యాగ్ తో అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ యొక్క 256GB వేరియంట్ ను రూ. 69,900 ధరతో మరియు హైఎండ్ 512GB వేరియంట్ ను రూ. 89,900 రూపాయల ధరతో అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను నెలకు రూ. 2,496 రూపాయల No Cost EMI తో కూడా పొందవచ్చని యాపిల్ తెలిపింది.

ఫిబ్రవరి 21 వ తేదీ సాయంత్రం 6:30 నుంచి ఈ ఫోన్ ముందస్తు బుకింగ్స్ ప్రారంభం అవుతాయి. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్స్ మొదలవుతాయి.

Apple iPhone 16e: ఫీచర్స్

యాపిల్ ఐఫోన్ 16e ఫోన్ ను 6.1 ఇంచ్ సూపర్ రెటీనా XDR డిస్ప్లేతో అందించింది. ఈ ఫోన్ అల్యూమినియం మరియు గ్లాస్ బ్యాక్ డిజైన్ తో వస్తుంది మరియు యాక్షన్ బటన్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను కూడా ఐఫోన్ 16 కలిగిన అదే A18 చిప్ సెట్ తో అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ కూడా యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ తో వస్తుంది.

యాపిల్ ఐఫోన్ 16e లో వెనుక సింగిల్ కెమెరా మాత్రమే ఉంటుంది. అయితే, ఇది 48MP సింగల్ కెమెరాని 2-in-1 కెమెరా సిస్టం తో అందించింది. ఈ ఫోన్ 24MP మరియు 48MP సూపర్ హై రిజల్యూషన్ ఫోటోలు అందుకోవచ్చని యాపిల్ తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ తో 60 fps 4K వీడియోలు Dolby Vision సపోర్ట్ తో షూట్ చేయవచ్చట. ఈ ఫోన్ 2x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ తో కూడా వస్తుంది.

Also Read: Boult X Mustang సిరీస్ నుంచి మూడు కొత్త ఆడియో ప్రొడక్ట్స్ లాంచ్ చేసిన బోల్ట్.!

ఈ ఫోన్ లో ఎమెర్జెన్సీ SOS క్రాష్ డిటెక్షన్ సపోర్ట్ కూడా అందించింది. ఈ ఫోన్ ను 26 గంటల వీడియో ప్లే బ్యాంక్ అందించే లాంగ్ బ్యాటరీ ఈ ఫోన్ లో అందించినట్లు యాపిల్ తెలిపింది. ఈ ఫోన్ కూడా ఫేస్ ఐడి సపోర్ట్ తో వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :