Apple iOS 26 announced with new liquid glass design and ai features
Apple iOS 26: యాపిల్ ఈరోజు నిర్వహించిన WWDC 2025 అతిపెద్ద కార్యక్రమం నుంచి యాపిల్ యూజర్ల కోసం చాలా సరికొత్త అప్డేట్స్ అనౌన్స్ చేసింది. ఇందులో ముఖ్యంగా యాపిల్ ఫోన్ యూజర్ల ఆతృతగా ఎదురు చూస్తున్న ఐఓఎస్ 26 ని అనౌన్స్ చేసింది. ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టం అప్డేట్ ను సరికొత్త లిక్విడ్ గ్లాస్ డిజైన్ మరియు AI ఫీచర్స్ వంటి మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ తో ప్రకటించింది. యాపిల్ ఫోన్ ఉపయోగిస్తున్న యూజర్ తెలుసుకోవాల్సిన కొత్త అప్డేట్ ఇక్కడ చూడవచ్చు.
యాపిల్ ఈరోజు నిర్వచించిన వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC 2025) కార్యక్రమం నుంచి ఈ అతి పెద్ద అనౌన్స్మెంట్ చేసింది. వాస్తవానికి యాపిల్ ఐఓఎస్ 19 ని విడుదల చేయాల్సి ఉండగా ఈ సాంప్రదాయ నెంబరింగ్ ను దాటవేసి సంవత్సరాన్ని బట్టి ఈ అప్డేట్ కు ఆ పేరు నిర్ణయిస్తున్నట్లు యాపిల్ తెలిపింది. అందుకే, ఈ లేటెస్ట్ అప్డేట్ ను ఐఓఎస్ 26 పేరుతో అనౌన్స్ చేసింది.
ఐఓఎస్ 26 కొత్త అప్డేట్ ను చాలా లేటెస్ట్ అప్డేట్స్ తో అందించింది. ఈ లేటెస్ట్ ఐఓఎస్ ను కొత్త లిక్విడ్ గ్లాస్ డిజైన్ తో అందించింది. అంతేకాదు, ఇందులో చాలా మార్పులు చేర్పులు కూడా చేసింది. ఈ కొత్త అప్డేట్ తో యూజర్ అనుకూలమైన చాలా ఫీచర్స్ ను జత చేసింది. ఇప్పుడు లాక్ స్క్రీన్ క్లాక్ ఇప్పుడు పూర్తి స్క్రీన్ లో కనిపిస్తుంది.
బ్రౌజింగ్ కోసం కూడా అనుకూలమైన అప్డేట్ ను జత చేసింది. అదేమిటంటే, యాపిల్ సేఫ్ బ్రౌజర్ సఫారీ ఇప్పుడు ఫ్లోటింగ్ ట్యాబ్ బార్ తో ఎడ్జ్ టు ఎడ్జ్ బ్రౌజింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇదే కాదు కెమెరా యాప్ లో కొత్త క్లీనర్ మరియు ఆన్ స్క్రీన్ కంట్రోల్స్ తో మరింత స్ట్రీమ్ లైన్ ఇంటర్ఫేస్ తో ఉంటుంది. కొత్త అప్డేట్ తో ఫోన్ యాప్ ఇప్పుడు కాల్ స్క్రీనింగ్ కోసం సపోర్ట్ చేస్తుంది. దీనితో యూజర్లు మరో కాల్ ను అటెండ్ చేయడానికి కాల్ ను హోల్డ్ లో పెట్టడానికి అవకాశం ఉంటుంది.
Also Read: Realme Narzo 80 Lite బిగ్ బ్యాటరీ మరియు రివర్స్ ఛార్జ్ సపోర్ట్ తో లాంచ్ అవుతోంది.!
ఐఓస్ 26 లో అందించిన కొత్త యాపిల్ విజువల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ తో ఏ వస్తువులు, క్లాత్ లేదా మరింకేదైనా వివరాలు తెలుసుకోవడానికి జస్ట్ స్క్రీన్ షాట్ తీస్తే సరిపోతుంది. ఇదే కాదు కొత్త ఈవెంట్స్ యాడ్ చేయడానికి మరియు Chat GPT లో డీటెయిల్స్ అడగడానికి కూడా ఉపయోగపడుతుంది.