ఒప్పో F11 ప్రో పైన Rs. 2000 బంపర్ డిస్కౌంట్
OPPO తన రెండు స్మార్ట్ ఫోన్ల పైన గొప్ప డిస్కౌంట్ ప్రకటించింది.
OPPO తన రెండు స్మార్ట్ ఫోన్ల పైన గొప్ప డిస్కౌంట్ ప్రకటించింది. ఇందులో అమెజాన్ నుండి ఒప్పో F11 ప్రో స్మార్ట్ ఫోన్ పైన డిస్కౌంట్ అందుబాటులో ఉంచగా ఒప్పో A5 పైన డిస్కౌంట్ ఫ్లిప్కార్ట్ నుండి అందిస్తోంది. అలాగే, ఆన్లైన్ ప్లాట్ఫారల పైన ఈ కొత్త ధర జాబితా చేయబడింది.
SurveyOppo 11 ప్రో మొబైల్ ఫోన్ను రెండు వేరియంట్లలో ప్రారంభించింది. వీటిలో 6GB RAM మరియు 64GB అంతర్గత స్టోరేజి వేరియంట్ రూ 24.990 మరియు 6GB RAM మరియు 128GB స్టోరేజి వేరియంట్ రూ 25.990 ధరతో విడుదల చేసింది. దీనికి ముందు, ఈ ఫోన్ ధర రూ. 2000 కు తగ్గించబడింది, కాబట్టి ఇది 22,990 రూపాయలకు మరియు 23,990 రూపాయలకు ఇప్పుడు అమ్ముడవుతోంది.
అయితే, ఇప్పుడు మరోసారి ఈ ధరలో మరొక రూ .2,000 చొప్పున తగ్గించింది. కాబట్టి , 64GB వేరియంట్ ఇప్పుడు రూ. 20,990 ధరతో, 128GB స్టోరేజి వేరియంట్ రూ .23,990 ధరతో అందుబాటులో ఉంచింది.
ఒప్పో సంస్థ Oppo A5 స్మార్ట్ ఫోన్ను రూ 12.990 ధరతో ప్రారందించింది.అయితే, ఇప్పుడు ఈ 64GB వేరియంట్ పైన రూ 1,000 తగ్గింపు ప్రకటన తరువాత ఇది రూ 11.990 ధరకి అందుబాటులో ఉంటుంది.
Oppo F11 ప్రో ప్రత్యేకతలు
Oppo 11 Pro ఒక F HD + డిస్ప్లే (1080×2340 పిక్సెళ్ళు) LCD స్క్రీన్ మరియు 19.5: 9 కారక నిష్పత్తి కలిగినటువంటి ఒక 6.53 అంగుళాలు స్క్రీన్ వస్తుంది. ఇది బ్యాటరీ పరంగా, ఒక 4,000 mAh బ్యాటరీతో ఉంటుంది, ఇది VOOC ఫ్లాష్ ఛార్జ్ 3.0 ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతు ఇస్తుంది. ఇందులో, ఆక్టా -కోర్ మీడియా టెక్ హిల్యో P70 ప్రాసెసర్, 6 GB RAM మరియు 64 GB స్టోరేజితో ప్రవేశపెట్టబడింది. ఇది, బాక్స్ బయటకు వస్తూనే, Android OS 9.0 పై ఆధారంగా ColorOs 6.0 OS తో అమలు అవుతుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
