Redmi నుండి మరొక 48MP కెమేరా ఫోన్ విడుదలకి సిద్ధం

Updated on 16-May-2019
HIGHLIGHTS

షావోమి, మరొక 48MP కెమేరా కలిగిన స్మార్ట్ ఫోన్ను ప్రకటించింది.

ఈ ఫోన్ యొక్క లాంచ్ డేటును మే 20 వ తేదికి సెట్ చేసింది.

షావోమి, మరొక 48MP కెమేరా కలిగిన స్మార్ట్ ఫోన్ను ప్రకటించింది. ముందుగా, రెడ్మి నోట్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ను కేవలం మిడ్ రేంజ్ ధరలో ఒక 48MP ప్రధాన కెమెరాతో తీసుకొచ్చిన విషయం మనకు తెలుసు. అయితే, ఇప్పుడు అటువంటి ఒక 48MP కెమెరాతో నోట్ 7 సిరీస్ లో మరొక స్మార్ట్ ఫోన్ను జాబితా చేయనుంది. అదే, Xiaomi Redmi Note 7S స్మార్ట్ ఫోన్. షావోమి తన వెబ్సైటు లో దీని గురించిన ప్రకటన విడుదల చేసింది.

ఇటీవల ఒక 48MP కెమేరాతో విడుదలయ్యి, అత్యంత క్రేజ్ సంపాదించుకున్న రెడ్మి నోట్ 7 ప్రో వలెనే ఇది కూడా ఒక 48MP కెమేరాతో వస్తుంది కాబట్టి, దీని పైన భారీగానే అంచనాలను వేస్తున్నారు షావోమి అభిమానులు. అంతేకాకుండా, ధర పరంగా కూడా ఇది రెడ్మి నోట్ 7 ప్రో మాదిరిగానే చాలా తక్కువగా ఉండవచ్చని ఊహిస్తున్నారు. అదే గనుక నిజమైతే, ఇది బడ్జెట్ ధరలో ఒక ఉన్నతమైన కెమెరాని తీసుకొచ్చే స్మార్ట్ ఫోన్ జాబితాలోకి రావచ్చు. ఈ ఫోన్ యొక్క లాంచ్ డేటును మే 20 వ తేదికి సెట్ చేసింది.  

ఇక ఇవన్నీ చూస్తుంటే, నిన్న చైనాలో రియల్మీ విడుదల చేసిన RealMe X స్మార్ట్ ఫోన్ ఇండియాలో రావడానికంటే ముందుగానే, షావోమి దానికి దీటైన స్మార్ట్ ఫోన్లను రంగంలో దించడానికి సిద్ధమవుతున్నట్లు అంచవేస్తున్నారు. ఇప్పటికే మార్కెట్లో Redmi Note 7 Pro సృష్టిస్తున్న సంచలనాలకు, 48MP కెమేరాతో రానున్న ఈ రెడ్మి నోట్ 7S కూడా తొడయ్యిందంటే అమ్మకాలు ఒక రేంజ్ లో జరగవచ్చని, మార్కెట్ వర్గాలు ఊహిస్తున్నాయి.                                   

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :