Samsung Galaxy S24 Ultra 5G పై బిగ్ డీల్ రివీల్ చేసిన అమెజాన్.!
Samsung Galaxy S24 Ultra 5G స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ ఇండియా బిగ్ డీల్ రివీల్ చేసింది
ఈ స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుకోవచ్చని అమెజాన్ ఊరిస్తోంది
మెజాన్ సేల్ నుంచి అన్ని ఆఫర్లు కలుపుకొని కేవలం రూ. 74,999 ధరలో అందుకునే అవకాశం
Samsung Galaxy S24 Ultra 5G స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ ఇండియా బిగ్ డీల్ రివీల్ చేసింది. శనివారం నుంచి స్టార్ట్ అవుతున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుకోవచ్చని అమెజాన్ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ సేల్ నుంచి ఎన్నడూ చూడనంత చవక ధరకు అందుబాటులోకి వస్తుందని అమెజాన్ ఊరిస్తోంది.
SurveySamsung Galaxy S24 Ultra 5G : ఆఫర్స్
శామ్సంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా ఫోన్ అమెజాన్ సేల్ నుంచి అన్ని ఆఫర్లు కలుపుకొని కేవలం రూ. 74,999 ధరలో అందుకునే అవకాశం అందిస్తునట్టు అమెజాన్ ప్రకటించింది. అమెజాన్ అప్ కమింగ్ బిగ్ సేల్ ప్రైమ్ డే సేల్ కోసం అందించిన టీజర్ పేజి నుంచి ఈ ఫోన్ అప్ కమింగ్ డిస్కౌంట్ ఆఫర్ మరియు ప్రైస్ తో అమెజాన్ ఈ ఫోన్ గురించి టీజింగ్ చేస్తోంది. ఇదే కనుక నిజం అయితే ఈ శామ్సంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ఎన్నడూ చూడనంత చవక ధరకు లభిస్తుంది.

ఈ స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో రూ. 1,29,999 రూపాయల ఆఫర్ ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ప్రస్తుతం అమెజాన్ నుంచి ఈ ఫోన్ 33% డిస్కౌంట్ తో రూ. 89,999 ఆఫర్ ధరకే సేల్ అవుతోంది. కానీ ఈ ఫోన్ అమెజాన్ సేల్ నుంచి మరింత చవక ధరకు లభిస్తుంది.
Also Read: Amazon Prime Day Sale: జబర్దస్త్ సౌండ్ బార్ ఆఫర్స్ ప్రకటించిన అమెజాన్.!
Samsung Galaxy S24 Ultra 5G : ఫీచర్లు
శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా 5జి స్మార్ట్ ఫోన్ Snapdragon 8 Gen 3 కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 12 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.79 ఇంచ్ Dynamic AMOLED 2X స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ QHD+ రిజల్యూషన్, 120 Hz రిఫ్రెష్ రేట్ మరియు 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ S పెన్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ 30fps వద్ద 8K UHD (7680 x 4320) రిజల్యూషన్ మరియు 120fps వద్ద 4K UHD వీడియో లను రికార్డ్ చేయగల పవర్ ఫుల్ కెమెరా కలిగి ఉంటుంది. ఇందులో 200 MP, 50 MP, 12 MP మరియు 10 MP కెమెరాలు కలిగిన క్వాడ్ రియర్ మరియు ముందు 12 MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 3x అండ్ 5x ఆప్టికల్ జూమ్ మరియు 100x డిజిటల్ జూమ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీని ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
