శామ్సంగ్ గెలాక్సీ S22 5G పైన అమెజాన్ భారీ డిస్కౌంట్ డీల్.!

Updated on 13-Oct-2022
HIGHLIGHTS

Samsung Galaxy S22 5G స్మార్ట్ ఫోన్ అమెజాన్ సేల్ నుండి మంచి ఆఫర్లతో లభిస్తోంది

ఈ ఫోన్ ను 23,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో పొందవచ్చు

ఈ స్మార్ట్‌ ఫోన్‌ పైన రూ.10,000 తగ్గింపు కూపన్ అఫర్ ను కూడా జతచేసింది

శామ్సంగ్ యొక్క ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ అయిన Galaxy S22 సిరీస్‌ లో సరసమైన ఫోన్ Samsung Galaxy S22 5G స్మార్ట్ ఫోన్ అమెజాన్ సేల్ నుండి మంచి ఆఫర్లతో లభిస్తోంది. ఇక ఈ అఫర్ విషయానికి వస్తే, రూ.72,999 ప్రారంభ ధరతో ఈ ఏడాది ప్రారంభంలో ఇండియాలో విడుదలైన ఈ స్మార్ట్‌ ఫోన్, అమెజాన్ సేల్ నుండి రూ.13,000 డిస్కౌంట్ తో కేవలం రూ.59,999 రూపాయలకే లభిస్తోంది. అంతేకాదు, అమెజాన్ సేల్ నుండి ఈ స్మార్ట్‌ ఫోన్‌ పైన రూ.10,000 తగ్గింపు కూపన్ అఫర్ ను కూడా జతచేసింది. తద్వారా ఈ ఫోన్ ను 23,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో మీరు పొందవచ్చు.

Bank Offer: శామ్సంగ్ గెలాక్సీ S22 5G స్మార్ట్ ఫోన్ Citi,ICICI మరియు Axis బ్యాంక్ కార్డ్స్ తో ఈ ఫోన్ కొనుగోలు చేసే వారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here     

Samsung Galaxy S22 5G: ప్రత్యేకతలు

శామ్సంగ్ గెలాక్సీ ఎస్22 5జి స్మార్ట్ ఫోన్ 6.1 ఇంచ్ AMOLED డిస్ప్లేని FHD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంటుంది.  ఈ Galaxy S22 ఫోన్ వేగవంతమైన పవర్ ఫుల్ 5G మరియు 4nm ప్రోసెసర్ Qualcomm Snapdragon 8 Gen 1 ప్రాసెసర్ కి జతగా 8GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.

ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో,50MP ప్రధాన సెన్సార్, 12MP అల్ట్రావైడ్ సెన్సార్, 10MP టెలీ ఫోటో సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ లో ఉన్న కెమెరాతో 8K లో వీడియోలను రికార్డ్ చెయవచ్చు. ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 3,700 mAh బ్యాటరీని కలిగివుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా One UI 4.1 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది మరియు Android 13 OS అప్డేట్ ను వెంటనే అందుకుంటుంది.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :