amazon offers huge discount on latest Fold Phone
ఇండియన్ మార్కెట్ లో గత సంవత్సరం విడుదలైన లేటెస్ట్ Fold Phone పైన Amazon ధమాకా ఆఫర్ ప్రకటించింది. ప్రముఖ మొబైల్ కంపెనీ TECNO, గత సంవత్సరం ఏప్రిల్ లో ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసిన TECNO Phantom V Fold 5G స్మార్ట్ ఫోన్ ఇప్పుడు భారీ తగ్గింపు మరియు ఇతర ఆఫర్లతో లభిస్తోంది. ఈ ధమాకా ఫోల్డ్ ఫోన్ ఆఫర్ మరియు స్పెక్స్ ఏమిటో ఒక లుక్కేద్దామా.
టెక్నో గత సంవత్సరం విడుదల చేసిన TECNO Phantom V Fold 5G స్మార్ట్ ఫోన్ పైన అమేజాన్ ఈ ధమాకా ఆఫర్ ను అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ (12GB RAM + 256GB) వేరియంట్ ను రూ. 89,999 రూపాయల ధరతో విడుదల చేసింది. ఈరోజు ఈ ఫోన్ అమేజాన్ ఇండియా నుండి రూ. 20,000 రూపాయల డిస్కౌంట్ తో రూ. 69,999 ఆఫర్ ధరకే అందిస్తోంది.
ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్ పైన రూ. 5,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ అఫర్ ను కూడా అందించింది. మొత్తంగా అన్ని ఆఫర్లను అందుకుంటే, ఈ కొత్త ఫోల్డ్ ఫోన్ ను రూ. 64,999 రూపాయల ధరకే అందుకోవచ్చు. అంటే, ఈ ఫోన్ ను 25 వేల రూపాయల డిస్కౌంట్ తో మీ సొంతం చేసుకునే వీలుంది.
Also Read: Realme 12X 5G: పవర్ ఫుల్ ఫోన్ తెస్తున్న రియల్ మి.. లీకైన ధర మరియు స్పెక్స్.!
ఈ టెక్నో ఫోల్డ్ ఫోన్ 7.85 ఇంచ్ 2K+120Hz LTPO మెయిన్ డిస్ప్లే మరియు 6.42 ఇంచ్ FHD+ LTPO AMOLED సబ్ డిస్ప్లే లను కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే కఠినమైన CG Victus గ్లాస్ ప్రొటెక్షన్ తో కలిగి ఉంటుంది. 1.08million AnTuTu స్క్రోర్ సాధించిన మీడియాటెక్ Dimensity 9000+ ప్రోసెసర్ తో పని చేస్తుంది.
దీనికి జతగా 12GB LPDDR5x ఫిజికల్ RAM మరియు 9GB మెమోరి ఫ్యూజన్ తో టోటల్ 21GB ర్యామ్ ఫీచర్ ను అందిస్తుంది. అంతేకాదు, వేగవంతమైన 256GB UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 5000 mAh బ్యాటరీ 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వుంది.
ఈ టెక్నో ఫోల్డ్ ఫోన్ 50MP టెలిఫోటో + 50MP మెయిన్ + 13MP అల్ట్రా వైడ్ రియర్ సెటప్ మరియు 32MP + 16MP సెల్ఫీ కెమేరాని కలిగి వుంది. అంతేకాదు, ఏరో స్పేస్ మెటీరియల్ తో చాలా కాలం మన్నగలదు.