Snapdragon 8 Elite తో వచ్చిన Realme GT 7 Pro భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది.!

Updated on 23-Sep-2025
HIGHLIGHTS

Snapdragon 8 Elite తో వచ్చిన Realme GT 7 Pro ఈరోజు భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది

ఈ ఫోన్ ను అమెజాన్ ఇండియా ఈరోజు బిగ్ డీల్స్ తో సేల్ చేస్తోంది

పండుగ డిస్కౌంట్, కూపన్ డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఈ ఫోన్ పై అందించింది

పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ అందించే Snapdragon 8 Elite తో వచ్చిన Realme GT 7 Pro ఈరోజు భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. ఈ ఫోన్ ను అమెజాన్ ఇండియా ఈరోజు బిగ్ డీల్స్ తో సేల్ చేస్తోంది. పండుగ డిస్కౌంట్, కూపన్ డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఈ ఫోన్ పై అందించింది. అందుకే, ఈ రియల్ మీ ఫ్లాగ్ షిప్ ఫోన్ ఈరోజు మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది.

Realme GT 7 Pro : ఆఫర్

ఈ రియల్ మీ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ప్రీమియం ఫీచర్స్ తో రూ. 59,999 రూపాయల బడ్జెట్ ధరలో ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి రూ. 10,000 భారీ డిస్కౌంట్ తో రూ. 49,999 ధరకే లిస్ట్ అయ్యింది. అదనంగా, ఈ ఫోన్ పై రూ. 5,000 కూపన్ డిస్కౌంట్ కూడా అమెజాన్ అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ పై రూ. 1,000 ఆల్ బ్యాంక్ కార్డ్ అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.

అమెజాన్ ఈరోజు ఈ ఫోన్ పై అందించిన ఈ మూడు ఆఫర్స్ తో కేవలం రూ. 43,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ ఫోన్ ను అమెజాన్ నుంచి ఈ ఆఫర్స్ తో కొనుగోలు చేయడానికి Buy From Here పై నొక్కండి.

Also Read: iPhone 15 ఫోన్ Amazon Sale నుంచి 32 వేల భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది.!

Realme GT 7 Pro : ఫీచర్స్

రియల్ మీ జిటి 7 ప్రో స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ పవర్ ఫుల్ చిప్ సెట్ Snapdragon 8 Elite తో పని చేస్తుంది. ఈ 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 3M AnTuTu స్కోర్ తో మంచి పెర్ఫార్మెన్స్ అందించే ఫోన్ గా చెప్పబడుతుంది. ఈ ఫోన్ లో రియల్ వరల్డ్ ఎకో క్వాడ్ కర్వుడ్ OLED+ బిగ్ స్క్రీన్ ఉంటుంది. ఇది 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 120 Hz రిఫ్రెష్ కలిగి ఉంటుంది.

ఈ రియల్ మీ ప్రీమియం ఫోన్ 50MP (Sony IMX 905) ట్రిపుల్ రియర్ కెమెరా మరియు ముందు 16MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ అండర్ వాటర్ ఫోటోగ్రఫీ, 3x ఆప్టికల్ జూమ్, 4K వీడియో రికార్డింగ్ మరియు AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6500 mAh బిగ్ బ్యాటరీ మరియు 120W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఓవరాల్ గా ఇది పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ అందించే ఫ్లాగ్ షిప్ ఫోన్ మరియు ఈరోజు అమెజాన్ సేల్ నుంచి బెస్ట్ ప్రైస్ లో లభిస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :