amazon offers big discount on Samsung Galaxy A55 5G
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అనౌన్స్ చేసింది. ఈ సేల్ జనవరి 16వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. అయితే, సేల్ కంటే ముందే ఈరోజు Samsung Galaxy A55 5G పై జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఇండియాలో 40 వేల రూపాయల సెగ్మెంట్ లో విడుదలైన ఈ ఫోన్ ను ఈరోజు అమెజాన్ అందించిన ఆఫర్స్ తో కేవలం 25 వేల రూపాయల ఉప బడ్జెట్లో అందుకోవచ్చు. అందుకే, అమెజాన్ ఈరోజు ప్రత్యేకంగా అందించిన బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్ ని ప్రత్యేకంగా మీకోసం అందిస్తున్నాం.
శాంసంగ్ గెలాక్సీ A55 స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో రూ. 39,999 స్టార్టింగ్ ప్రైస్ తో విడుదల చేసింది. అయితే, ఈరోజు అమెజాన్ ఇండియా ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 15,000 భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 24,999 ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ ఫోన్ పై రూ. 1,395 రూపాయల వడ్డీ సేవింగ్ చేసే నో కాస్ట్ EMI ఆఫర్ ని కూడా అందించింది. ఈ ఫోన్ ను ఈరోజు అమెజాన్ నుంచి మంచి బడ్జెట్ ధరలో అందుకోవచ్చు. Buy From Here
Also Read: భారీ ఆఫర్స్ తో Great Republic Day Sale అనౌన్స్ చేసిన అమెజాన్.!
శాంసంగ్ గెలాక్సీ A55 స్మార్ట్ ఫోన్ ను ప్రీమియం మెటల్ ఫ్రేమ్ మరియు సౌకర్యవంతమైన హ్యాండ్ హోల్డ్ డిజైన్ తో అందించింది. ఈ ఫోన్ లో ముందు మరియు వెనుక గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటక్షన్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో 6.6 ఇంచ్ Super AMOLED డిస్‌ప్లే ఉంటుంది మరియు ఇందులో ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR10+ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ శాంసంగ్ యొక్క సొంత Exynos 1480 (4nm) చిప్ సెట్ తో అందించింది మరియు జతగా 8 జీబీ ర్యామ్ అండ్ 128 జీబీ స్టోరేజ్ ఉన్నాయి.
ఈ ప్రీమియం ఫోన్ లో వెనుక ప్రీమియం కెమెరా సెటప్ కూడా ఉంటుంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా (OIS + PDAF), 12MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 5MP మాక్రో కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. అలాగే, ముందు 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 30FPS 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు గొప్ప కెమెరా ఫిల్టర్లు మరియు AI కెమెరా ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 5000mAh భారీ బ్యాటరీ మరియు 25W సూపర్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ IP67 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో వస్తుంది.