Galaxy S26 Plus రాకతో గెలాక్సీ S25 Plus పై భారీ ఆఫర్లు ప్రకటించిన అమెజాన్.!

HIGHLIGHTS

శాంసంగ్ కొత్తగా గెలాక్సీ ఎస్ 26 సిరీస్ ను విడుదల చేసింది

కొత్త ఫోన్స్ రాకతో గత సిరీస్ ఫోన్ల పై ఆఫర్లు మొదలయ్యాయి

ముందుగా గెలాక్సీ S25 Plus పై అమెజాన్ ఆఫర్ల వర్షం కురిపించింది

శాంసంగ్ కొత్తగా గెలాక్సీ ఎస్ 26 సిరీస్ ను విడుదల చేసింది. కొత్త ఫోన్స్ రాకతో గత సిరీస్ ఫోన్ల పై ఆఫర్లు మొదలయ్యాయి. ముందుగా గెలాక్సీ S25 Plus పై అమెజాన్ ఆఫర్ల వర్షం కురిపించింది. ఈ ఫోన్ ఇండియాలో దాదాపు లక్ష రూపాయల ధరలో వచ్చిన ఈ ఫోన్ ఇప్పుడు అమెజాన్ ఆఫర్స్ తో 70 వేల రూపాయల తక్కువ ధరలో ఈరోజు అమెజాన్ నుంచి లభిస్తుంది.

Samsung గెలాక్సీ S25 Plus : ఆఫర్స్

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 ప్లస్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 99,999 ధరతో గత సంవత్సరం లాంచ్ అయ్యింది . అయితే, ఈరోజు అమెజాన్ నుంచి 25% భారీ డిస్కౌంట్ తో రూ. 74,994 ప్రైస్ తో లిస్ట్ అయ్యింది. అంతేకాదు, ఈ ఫోన్ పై రూ. 4,000 రూపాయల ప్రత్యేకమైన కూపన్ డిస్కౌంట్ మరియు HDFC క్రెడిట్ కార్డు పై రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.

అమెజాన్ ఈ రోజు శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 ప్లస్ స్మార్ట్ ఫోన్ పై అందించిన ఆఫర్స్ తో ఈ ఫోన్ కేవలం రూ. 70,494 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here

Also Read: Samsung Galaxy Buds 4 Series: బెస్ట్ ఫిట్ అండ్ Hi-Fi సౌండ్ తో రిలీజ్ అయ్యింది.!

Samsung గెలాక్సీ S25 Plus : ఫీచర్స్

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 ప్లస్ ఫోన్ 6.7 ఇంచ్ డైనమిక్ AMOLED 2X డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ QHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR10+ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8 Elite తో పని చేస్తుంది. ఈ చిప్ సెట్ తో జతగా ఈ ఫోన్ లో 12 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉన్నాయి.

ఈ ఫోన్ OIS ఫోటో స్టెబిలైజేషన్ కలిగిన 50MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 10MP టెలిఫోటో కెమెరా కలిగి న ట్రిపుల్ రియర్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 12MP సెల్ఫీ కెమెరా తో కూడా వస్తుంది. ఈ ఫోన్ 60FPS 4K రికార్డింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ 4,900 mAh  బిగ్ బ్యాటరీతో వస్తుంది మరియు 45W ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్ అండ్ 15W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :