Google Pixel 9A: ఈరోజు అమెజాన్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో సేల్ అవుతోంది.!

Updated on 03-Oct-2025
HIGHLIGHTS

ఈరోజు గూగుల్ పిక్సెల్ 9a స్మార్ట్ ఫోన్ భారీ డిస్కౌంట్ తో చాలా రీజనబుల్ ధరలో లభిస్తుంది

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈ బిగ్ డీల్ అందించింది

గూగుల్ పిక్సెల్ 9a స్మార్ట్ ఫోన్ గూగుల్ Tensor G4 చిప్ సెట్ తో పని చేస్తుంది

Google Pixel 9A: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈరోజు గూగుల్ పిక్సెల్ 9a స్మార్ట్ ఫోన్ భారీ డిస్కౌంట్ తో చాలా రీజనబుల్ ధరలో లభిస్తుంది. ఈ గూగుల్ ఫోన్ భారీ కెమెరా సెటప్, గొప్ప డిజైన్ మరియు ప్రీమియం ఫీచర్స్ తో వచ్చింది మరియు ఈరోజు అమెజాన్ సేల్ నుంచి భారీ ఆఫర్స్ తో లభిస్తుంది.

Google Pixel 9A: ఆఫర్స్

గూగుల్ పిక్సెల్ 9a స్మార్ట్ ఫోన్ 2025 మార్చి నెలలో రూ. 49,999 ధరతో ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ గూగుల్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి రూ. 5,100 రూపాయల డిస్కౌంట్ తో కేవలం రూ. 44,899 రూపాయల ఆఫర్ ధరతో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ సేల్ నుండి SBI డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,000 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

ఈ ఆఫర్స్ తో గూగుల్ పిక్సెల్ 9a స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ సేల్ నుంచి కేవలం రూ. 43,899 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ సేల్ నుంచి ఆఫర్ ధరకే కొనడానికి Buy From Here పై క్లిక్ చేయండి.

Google Pixel 9A: ఫీచర్స్

గూగుల్ పిక్సెల్ 9a స్మార్ట్ ఫోన్ గూగుల్ Tensor G4 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో సెక్యూరిటీ కోసం ప్రత్యేకమైన చిప్ సెట్, 8 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజ్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో 6.3 ఇంచ్ ఆక్టువా OLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు గొప్ప బ్రైట్నెస్ కలిగి ఉంటుంది.

ఈ గూగుల్ స్మార్ట్ ఫోన్ లో వెనుక 48MP మెయిన్ కెమెరా జతగా 13MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన దుఆ; రియర్ కెమెరా మరియు ముందు 13MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఫ్రంట్ అండ్ రియర్ కెమెరా తో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్స్ మరియు గుట్టల కొద్దీ గూగుల్ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Also Read: SnapChat యూజర్లకు పిడుగు లాంటి వార్త అందించిన కంపెనీ.!

ఈ గూగుల్ స్మార్ట్ ఫోన్ 5100 mAh బిగ్ బ్యాటరీ మరియు ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్ మరియు Qi-certified వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ Android 15 OS తో నడుస్తుంది మరియు Emergency SOS, క్రైసిస్ అలర్ట్ మరియు మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :