Samsung Galaxy S24 Ultra ఫోన్ పై 45 వేల భారీ తగ్గింపు అందించిన అమెజాన్.!

Updated on 19-May-2025
HIGHLIGHTS

Samsung Galaxy S24 Ultra స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ ఇండియా భారీ తగ్గింపు ఆఫర్

అమెజాన్ ఇండియా ఈరోజు 45 వేల రూపాయల భారీ తగ్గింపు ఆఫర్ ప్రకటించింది

ఈ స్మార్ట్ ఫోన్ మీకు 45 వేల రూపాయల కంటే అధిక డిస్కౌంట్ తో తక్కువ ధరకు లభిస్తుంది

Samsung Galaxy S24 Ultra స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ ఇండియా ఈరోజు 45 వేల రూపాయల భారీ తగ్గింపు ఆఫర్ ప్రకటించింది. ఈ ఫోన్ శామ్ సంగ్ అధికారిక వెబ్ సైట్ నుండి లభిస్తున్న ధరతో పోలిస్తే కూడా అమెజాన్ నుంచి చాలా తక్కువ ధరకు లభిస్తుంది. ఈ ఫోన్ S-Pen మరియు భారీ ఫీచర్స్ తో ఆకట్టుకునే శామ్సంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ మరియు ఈరోజు అమెజాన్ నుంచి తక్కువ ధరకు లభిస్తుంది.

Samsung Galaxy S24 Ultra : ఆఫర్

భారత మార్కెట్లో లక్ష ఇరవై వేలకు పైగా ధరతో విడుదలైన ఈ ఫోన్ ఈరోజు అమెజాన్ నుంచి 85 వేల బడ్జెట్ ధరలో లభిస్తోంది. క్లియర్ గా చెప్పాలంటే, ఈ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 1,29,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ రూ. 44,699 రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ. 85,300 రూపాయల ఆఫర్ ధరకే సేల్ లభిస్తోంది.

ఇది కాకుండా ఈ ఫోన్ పై 5% Amazon Pay ICICI డిస్కౌంట్ ఆఫర్ మరియు 6 నెలల No Cost EMI ని కూడా ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ మీకు 45 వేల రూపాయల కంటే అధిక డిస్కౌంట్ తో తక్కువ ధరకు లభిస్తుంది. Buy From Here

Also Read: Realme GT 7: 4K Dolby Vision కెమెరా సెటప్ తో లాంచ్ అవుతోంది.!

Samsung Galaxy S24 Ultra : ఫీచర్స్

ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ టైటానియం ఎక్స్టీరియర్ మరియు 6.8 ఇంచ్ ఫ్లాట్ డైనమిక్ AMOLED 2x స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ Quad HD+ (3120 x 1440) రిజల్యూషన్, విజన్ బూస్టర్ మరియు గొరిల్లా గ్లాస్ అర్మొర్ ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Snapdragon 8 Gen 3 చిప్ సెట్ తో పని చేస్తుంది ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో వెనుక 200MP మెయిన్, 50 MP టెలిఫోటో, 12 MP అల్ట్రా వైడ్ మరియు 10 MP టెలిఫోటో కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 30FPS తో UHD 8K (7680 x 4320) వీడియో రికార్డ్ సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు అనేకమైన కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

ఈ శామ్సంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ Galaxy AI, ఫోటో అసిస్ట్, డ్రాయింగ్ అసిస్ట్ మరియు AI ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ S-Pen సపోర్ట్ తో కూడా వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :