HONOR Days Sale నుంచి హానర్ 200 5జి ఫోన్ పై భారీ తగ్గింపు ప్రకటించిన అమెజాన్.!

HIGHLIGHTS

HONOR Days Sale ను అమెజాన్ ఇండియా ప్రకటించింది

ఈ సేల్ నవంబర్ 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది

ఈ సేల్ నుంచి హానర్ 200 5G స్మార్ట్ ఫోన్ భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది

HONOR Days Sale ను అమెజాన్ ఇండియా ప్రకటించింది. ఈ సేల్ ఈరోజు నుంచి మొదలయ్యింది మరియు ఈ సేల్ నవంబర్ 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. అమెజాన్ ఇండియా ప్రకటించిన ఈ సేల్ నుంచి హానర్ యొక్క లేటెస్ట్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ అయిన హానర్ 200 5G స్మార్ట్ ఫోన్ భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది.

HONOR Days Sale

హానర్ డేస్ సేల్ నుంచి ఈరోజు అమెజాన్ హానర్ యొక్క చాలా స్మార్ట్ ఫోన్స్ పైన భారీ ఆఫర్లు ప్రకటించింది. అయితే, వీటన్నింటిలో హానర్ 200 5జి స్మార్ట్ ఫోన్ పై అందించిన ఆఫర్ అమితంగా ఆకర్షిస్తోంది. ఎందుకంటే, ఇండియాలో 35 వేల రూపాయల బడ్జెట్ లో విడుదలైన ఈ ఫోన్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 25 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది.

ఆఫర్ ధర

హానర్ 200 5జి స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో రూ. 34,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. అయితే, అమెజాన్ ఈ రోజు అందించిన హానర్ డే సెల్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 26,999 రూపాయల ధరకు లభిస్తోంది. అంతేకాదు, హానర్ 200 5జి ఫోన్ పై Bajaj Finserv EMI మరియు సెలెక్టెడ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై రూ. 1,215 EMI ఇంట్రెస్ట్ సేవింగ్ ఆఫర్ ను కూడా అమెజాన్ అందించింది. Buy From Here

Also Read: Smart Tv Offer: ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి 7 వేలకే పెద్ద స్మార్ట్ టీవీ అందుకోండి.!

HONOR 200 5G : ఫీచర్స్

హానర్ 200 5జి స్మార్ట్ ఫోన్ డ్యూయల్ OIS 50MP + 50MP + 12MP ట్రిపుల్ రియర్ మరియు 50MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ కెమెరా 4K వీడియో, 50X జూమ్ మరియు AI సపోర్ట్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Snapdragon 7 Gen 3 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు 8GB ర్యామ్ తో పాటు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో 6.7 ఇంచ్ Curved AMOLED స్క్రీన్ వుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు రిస్క్ ఫ్రీ డిమ్మింగ్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది మరియు 5200 mAh 2nd Gen సిలికాన్ – కార్బన్ బ్యాటరీ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :