అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఎపిక్ డీల్ గా iPhone 15.. ఆల్ టైమ్ చవక ధరలో లభిస్తుంది.!

Updated on 13-Jan-2026
HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఎపిక్ డీల్ గా iPhone 15 ను అనౌన్స్ చేసింది

ఈ ఫోన్ ను అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి ఎన్నడూ చూడనంత చవక ధరలో పొందవచ్చని టీజింగ్ చేస్తోంది

50 వేల బడ్జెట్ ధరలోనే పొందవచ్చని అమెజాన్ టీజర్ పేజీలో పెద్ద పోస్టర్ అందించి మరీ టీజింగ్ చేస్తోంది

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఎపిక్ డీల్ గా iPhone 15 ను అనౌన్స్ చేసింది. యాపిల్ సూపర్ కెమెరా ఫోన్ గా చాలా మంచి రివ్యూలు అందుకున్న ఈ ఫోన్ ను అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి ఎన్నడూ చూడనంత చవక ధరలో పొందవచ్చని అమెజాన్ టీజింగ్ చేస్తోంది. అప్ కమింగ్ అమెజాన్ బిగ్ సేల్ నుంచి ఈ యాపిల్ ఫోన్ ను కేవలం 50 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే పొందవచ్చని అమెజాన్ టీజర్ పేజీలో పెద్ద పోస్టర్ అందించి మరీ టీజింగ్ చేస్తోంది.

iPhone 15 : అమెజాన్ ఆఫర్స్

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 జనవరి 16వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ అప్ కమింగ్ సేల్ నుంచి యాపిల్ ఐఫోన్ 15 ఫోన్ చాలా చవక ధరలో లభిస్తుందని అమెజాన్ ప్రకటించింది. ఈ సేల్ నుంచి ఐఫోన్ 15 పై అమెజాన్ అందించిన అన్ని ఆఫర్స్ తో కేవలం రూ. 50,249 రూపాయల అతి తక్కువ ప్రైస్ లో ఈ ఫోన్ అందుకోవచ్చని అమెజాన్ చెబుతోంది.

ఈ ఫోన్ రూ. 79,900 ధరతో ఇండియాలో లాంచ్ అయ్యింది. అయితే, కొత్త సిరీస్ లాంచ్ తో ఈ ఫోన్ ప్రైస్ కట్ ను యాపిల్ అందించింది. అయితే, ఇప్పుడు అమెజాన్ సేల్ నుంచి ఏకంగా రూ. 29 వేల రూపాయల డిస్కౌంట్ ధరలో మీకు లభిస్తుంది.

Also Read: 10 వేల వరకు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో Oppo Reno 15 5G సేల్ మొదలయ్యింది.!

iPhone 15 : ఫీచర్స్

ఐఫోన్ 15 స్మార్ట్ ఫోన్ 6.1 ఇంచ్ సూపర్ రెటీనా XDR OLED డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ HDR10, True Tone మరియు డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఫింగర్ ప్రింట్ రెసిస్టెంట్ కోటింగ్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ యాపిల్ A16 Bionic చిప్ తో పని చేస్తుంది. ఇందులో ఉన్న శక్తివంతమైన GPU మరియు CPU వల్ల గేమింగ్, ఫోటోలు మరియు మల్టీ-టాస్కింగ్ వేగంగా సాగుతాయి.

ఇక కెమెరా విభాగానికి వస్తే, ఈ ఫోన్ లో వెనుక 48MP మెయిన్ కెమెరా మరియు 12MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ లో 12MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఐఫోన్ 4K Dolby Vision వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఫోటోనిక్ ఇంజిన్, డీప్ ఫ్యూజన్, Smart HDR 5, నైట్ మోడ్ మరియు పోర్ట్రెయిట్ లైటింగ్ వంటి మరిన్ని ఆకట్టుకునే కెమెరా టెక్నాలజీ లను కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ 20 గంటలు వీడియో ప్లే బ్యాక్ అందించే బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు USB-C ఫాస్ట్ ఛార్జింగ్ తో 30 నిమిషాల్లో సుమారు 50% ఛార్జ్ అయ్యే ఫీచర్ కలిగి వుంది. ఈ ఫోన్ IP68 రేటింగ్ తో వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్ తో ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :