అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ తీసుకొస్తోంది మరిన్ని గ్రేట్ డీల్స్

Updated on 10-Oct-2019
HIGHLIGHTS

ICICI క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో చేసిన కొనుగోళ్లకు 10% తక్షణ తగ్గింపు ఇవ్వబడుతుంది.

అమెజాన్ ఇండియా యొక్క మొదటి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ముగిసింది. అయితే, అమేజాన్ దీపావళి సందర్భంగా, మరోసారి కంపెనీ తదుపరి సేల్ ని ప్రకటించింది. ఈ సేల్  అక్టోబర్ 13 అంటే  ప్రారంభమై అక్టోబర్ 17 వరకు కొనసాగుతుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యుల కోసం ఈ సేల్  అక్టోబర్ 12 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది.

అమెజాన్ మరియు ICICI బ్యాంక్‌ యొక్క భాగస్వామ్యం ఈ సేల్  జరగనుంది, కాబట్టి ఇందులోభాగంగా వినియోగదారులకు ICICI  క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో చేసిన కొనుగోళ్లకు 10% తక్షణ తగ్గింపు ఇవ్వబడుతుంది. ఈ సేల్ సమయంలో, మీరు స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, టీవీలు మరియు ఇతర గాడ్జెట్‌లలో గొప్ప డీల్స్  మరియు ఆఫర్‌లను పొందుతారు.

ఈ సేల్ సమయంలో, స్మార్ట్‌ ఫోన్లకు 40% వరకు తగ్గింపు లభిస్తుంది మరియు ఉచిత స్క్రీన్ రీప్లేస్మెంట్ , ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, NoCost  EMI మొదలైన ప్రయోజనాలు కూడా చేర్చబడతాయి. అలాగే,  ఆపిల్, షావోమి , వన్‌ప్లస్, శామ్‌సంగ్, వివో, హానర్ వంటి బ్రాండ్ల ఫోన్‌లలో మంచి డీల్స్ అందించబడతాయి.

అమెజాన్ వెబ్‌సైట్ యొక్క టీజర్ పేజీ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్: సెలబ్రేషన్ స్పెషల్ సేల్‌లో అమెజాన్ స్పెషల్ లాంచ్ కూడా ఉంటుంది. రాబోయే వన్‌ప్లస్ 7 T  ప్రో ను కూడా ఈ సెల్‌కు తీసుకురావచ్చు.

ఇ-కామర్స్ దిగ్గజం గృహోపకరణాలకు 60% వరకు తగ్గింపుతో పాటు NoCost  EMII, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, ఇన్స్టాలేషన్ మరియు ఉచిత డెలివరీ మొదలైనవి లభిస్తాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :