అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ : కొన్ని స్మార్ట్ ఫోన్ల రేట్లను వెల్లడించనుంది

HIGHLIGHTS

ఈ సేల్ జనవరి 20 నుండి 23 వరకు జరగనుంది.

అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ : కొన్ని స్మార్ట్ ఫోన్ల రేట్లను వెల్లడించనుంది

అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ సేల్, జనవరి 20 నుంచి ప్రారంభం కానుంది. అయితే, ప్రైమ్ మెంబర్లు ఒక రోజు ముందు నుండే యాక్సెస్ అందుకుంటారు, అనగా జనవరి 19న  12:00 గంటల నుండి వారికీ ఈ సేల్ అందుబాటులోవుంటుంది. అదనంగా, HDFC బ్యాంకు యొక్క డెబిట్ లేదా క్రెడిట్ కార్డును ఉపయోగించి ఉత్పత్తిని కొనుగోలు చేసేవారికీ 10% తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. HDFC బ్యాంకు డెబిట్ కార్డుతో రూ.10,000 కంటే పైన కొనుగోలుచేసేవారికి No Cost EMI కూడా ఉంటుంది, కాబట్టి ఈ e-కామర్స్ ప్లాట్ఫాంపై ఇప్పటి వరకు వెల్లడించిన కొన్ని డీల్స్ పరిశీలిద్దాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OnePlus 6T

వన్ ప్లస్ యొక్క 'సరికొత్త ఫోన్, ఈ OnePlus 6T. సేల్ సమయంలో, ఈ ఫోన్ అద్భుతమైన ఎక్స్చేంజ్ ఆఫరుతో అందుబాటులో ఉంటుంది. కొనుగోలుదారులు దీనితో ఎక్స్ఛేంజీలో 9,000 రూపాయల వరకు తగ్గింపు ఆశించవచ్చు. అయితే, పూర్తి ఒప్పందాన్ని అమెజాన్ ఇంకా వెల్లడించలేదు. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 845 ప్రాసెసరుతో వస్తుంది మరియు డిస్ప్లేలో ఒక వేలిముద్ర సెన్సార్ను కలిగి ఉంటుంది.

Xiaomi Redmi Y2

ఈ షావోమి రెడ్మి Y2, వెనుక డ్యూయల్ కెమెరాను కలిగి ఉంది మరియు క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 625 ప్రాసెసరుతో వస్తుంది. ఈ ఫోన్,  ప్రస్తుతం అమెజాన్ లో  10,999 రూపాయలకు అందుబాటులో ఉంది. అయితే, పేజీలోని సమాచారం ప్రకారం ఈ సేల్ సమయంలో ఇది రూ.10,000 కంటే తక్కువధరకు ఉండవచ్చని అంచనా, ఈ ఫోన్ దాని అత్యల్ప ధర వద్ద ఉంటుందని సేల్ పేజీలో చూపబడింది.

ఐఫోన్ X

మీరు ఒక ఐఫోన్ అభిమాని అయితే, ఐఫోన్ X ని మీ సొంతం చేసుకోవాలనే ఆలోచనలో గనుక మీరు ఉంటే, అది నిజం చేసుకోవడనికి ఇదే సరైన సమయం కావచ్చు. ఈ సేల్ సమయంలో, ఈ ఫోన్ భారీ డిస్కౌంటుతో వస్తుంది. ఈ ఫోన్,  ఆపిల్ A11 బయోనిక్ చిప్సెట్ చేత శక్తిని కలిగి ఉంది మరియు వెనుకవైపు దాడులు 12MP కెమెరాను కలిగి ఉంది. అయితే ఇప్పటికే రూ .91,999 ధర నుంచి రూ. 74,999 తగ్గింపు ధర వద్ద, ప్రస్తుతం అందుబాటులో ఉంది.

రియల్మీ U1

RealMe U సిరీస్ లో వచ్చిన మొట్టమొదటి ఫోన్  U1 కూడా ధర తగ్గింపు పొందుతుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు సేల్ సమయంలో No Cost EMI తో  పొందవచ్చు మరియు ఇంచుమించుగా రూ .10,999 ధర పరిధిలో ఉండవచ్చు. అయితే, ప్రస్తుతం ఈ ఫోన్ రూ .11,999 ధరతో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్,  25MP AI- ఆధారిత సెల్ఫీ- కెమెరా మరియు డిస్ప్లే పైన ఒక వాటర్ డ్రాప్ నోచ్ వంటి ప్రత్యేకతలతో వస్తుంది.

ఈ సేల్ సమయంలో, వివో V9, ఒప్పో R17, షావోమి మి A2, హానర్ 8X మరియు ఇలాంటి మరిన్నిడివైజ్ లు ఆఫర్లతో అందుబాటులోఉంటాయి.ఈ పేజీ ప్రకారం, ఎలక్ట్రానిక్స్ పైన 65% వరకు తగ్గింపు అందించంనుంది. రాబోయే మరిన్ని డీల్స్ మరియు సేల్ ఆఫర్లను తెలుసుకోవడానికి ఇంకొంత సమయం వేచివుండాల్సి ఉంటుంది. 

అమేజాన్ సేల్ ఆఫర్ల కోసం ఇక్కడ నొక్కండి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo