అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ : ఈ సేల్ యొక్క కొన్ని స్మార్ట్ ఫోన్ ధరలను వెల్లండించింది.
ఈ రోజు మధ్యాహ్నం 12:00 గంటల నుండి, ప్రైమ్ మెంబర్లకు, ఈ సేల్ అందుబాటులోవుంటుంది.
జనవరి 19న 12:00 గంటల నుండి అనగా ఈ రోజు మధ్యాహ్నం 12:00 గంటల నుండి, ప్రైమ్ మెంబర్లకు, ఈ సేల్ అందుబాటులోవుంటుంది. కాబట్టి, ఈ e-కామర్స్ ప్లాట్ఫాంపై ఇప్పటి వరకు వెల్లడించిన కొన్ని డీల్స్ పరిశీలిద్దాం. HDFC బ్యాంకు యొక్క డెబిట్ లేదా క్రెడిట్ కార్డును ఉపయోగించి ఉత్పత్తిని కొనుగోలు చేసేవారికీ 10% తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. HDFC బ్యాంకు డెబిట్ కార్డుతో రూ.10,000 కంటే పైన కొనుగోలుచేసేవారికి No Cost EMI కూడా ఉంటుంది,
Surveyహువావే Y9 (2019)
ఇటీవలే, సర్కోతగా మార్కెట్లోకి అడుగు పెట్టిన, ఈ స్మార్ట్ ఫోన్ మంచి ఆఫరుతో ఈ సేల్ ద్వారా అమ్మకానికి ఉండనుంది. ఈ స్మార్ట్ ఫోన్నీ, ఈ సేల్ ద్వారా కొనుగోలు చేసేవారికి, రూ. 2,999 విలువగల బోట్ రొకర్జ్ స్పోర్ట్స్ బ్లూటూత్ ఇయర్ ఫోన్ ఉచితంగా పొందవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ AI డ్యూయల్ కెమెరాలు మరియు కిరిణ్ 710 ప్రోసెసరుతో వస్తుంది.
Xiaomi Redmi Y2
ఈ షావోమి రెడ్మి Y2, వెనుక డ్యూయల్ కెమెరాను కలిగి ఉంది మరియు క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 625 ప్రాసెసరుతో వస్తుంది. ఈ ఫోన్, ప్రస్తుతం అమెజాన్ లో 10,999 రూపాయలకు అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ యొక్క సేల్ ప్రైస్ తెలియచేయబడింది. ఇది రూ.7,999 ధరతో ఈ సేల్ ద్వారా అమ్మకానికి ఉంటుందని సేల్ పేజీలో చూపబడింది.
రియల్మీ U1
RealMe U సిరీస్ లో వచ్చిన మొట్టమొదటి ఫోన్ U1 కూడా ధర తగ్గింపు పొందింది. ఆసక్తిగల కొనుగోలుదారులు సేల్ సమయంలో No Cost EMI తో పొందవచ్చు మరియు దీని ధరను రూ .10,999 గా ఆవిష్కరించారు. ముందుగా, ఈ ఫోన్ రూ .11,999 ధరతో ఉండేది. ఈ స్మార్ట్ ఫోన్, 25MP AI- ఆధారిత సెల్ఫీ- కెమెరా మరియు డిస్ప్లే పైన ఒక వాటర్ డ్రాప్ నోచ్ వంటి ప్రత్యేకతలతో వస్తుంది.
OnePlus 6T
వన్ ప్లస్ యొక్క 'సరికొత్త ఫోన్, ఈ OnePlus 6T. సేల్ సమయంలో, ఈ ఫోన్ అద్భుతమైన ఎక్స్చేంజ్ ఆఫరుతో అందుబాటులో ఉంటుంది. కొనుగోలుదారులు దీనితో ఎక్స్ఛేంజీలో 2,000 రూపాయల వరకు అధిక తగ్గింపు ఆశించవచ్చు. అయితే, పూర్తి ఒప్పందాన్ని అమెజాన్ ఇంకా వెల్లడించలేదు. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 845 ప్రాసెసరుతో వస్తుంది మరియు డిస్ప్లేలో ఒక వేలిముద్ర సెన్సార్ను కలిగి ఉంటుంది.
ఈ సేల్ సమయంలో, వివో V9, ఒప్పో R17, షావోమి మి A2, హానర్ 8X మరియు ఇలాంటి మరిన్నిడివైజ్ లు ఆఫర్లతో అందుబాటులోఉంటాయి.ఈ పేజీ ప్రకారం, ఎలక్ట్రానిక్స్ పైన 65% వరకు తగ్గింపు అందించంనుంది. రాబోయే మరిన్ని డీల్స్ మరియు సేల్ ఆఫర్లను తెలుసుకోవడానికి ఇంకొంత సమయం వేచివుండాల్సి ఉంటుంది.
అమేజాన్ సేల్ ఆఫర్ల కోసం ఇక్కడ నొక్కండి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile