అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ : హువావే ట్రెండీ ఫోన్లు మరింత చౌకయ్యాయి

HIGHLIGHTS

ఈ అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ నుండి హువావే స్మార్ట్ ఫోన్ల పైన భారీ డిస్కౌంట్లను అధికారికంగా ప్రకటించింది హువావే.

అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ : హువావే ట్రెండీ ఫోన్లు మరింత చౌకయ్యాయి

జనవరి 20 నుండి 23 వరకూ జరగనున్న ఈ అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ నుండి హువావే స్మార్ట్ ఫోన్ల పైన భారీ డిస్కౌంట్లను అధికారికంగా ప్రకటించింది హువావే. ఈ ప్రకటనతో, ఈ సేల్ పైన వినియోగదారులలో భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ సేల్ ప్రారంభమవడానికి ఇంకా మూడు రోజులు ఉండగానే హువావే ముందుగానే ఈ ప్రకటన చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

 ఈ సేల్ సమయంలో, హువావే తన యొక్క 4 ట్రెండీ స్మార్ట్ ఫోన్ల పైన ఈ డిస్కౌంటును ఇవ్వనున్నట్లు ప్రకటన చేసింది. అందులో, హువావే P20 లైట్, హువావే నోవా 3i, హువావే నోవా 3 మరియు హువావే P20 ప్రో, ఫోనులు ఉన్నాయి.దాదాపుగా 7000 రూపాయల వరకు వీటిపైనా డిస్కౌంట్ అందుకోవచ్చు మరియు No Cost EMI కూడా అందుబాటులో ఉంటుంది.     

Huawei P20 lite

ఈ ఫోన్ 24 MP సెల్ఫీ కెమరాతో, ఈ ధర పరిధిలో అధితమైన ఫోటోలను అందిస్తుంది. అలాగే, 1.12um పిక్సెల్ సైజు లెన్స్ 16MP ప్రధాన కెమరా గల డ్యూయల్ కెమెరా సేటప్పుతో వస్తుంది. ఈ ఫోన్ 2280 x 1080 పిక్సెల్ రిజల్యూషన్ అందిచగల ఒక FHD+ డిస్ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్, ప్రస్తుతం ధర రూ. 19,999 గా ఉండగా, దీనిపైన 7,000 రూపాయల డిస్కౌంట్ అందించనుంది ఈ సేల్ ద్వారా. అంటే, ఈ సేల్ నుండి ఈ Huawei P20 lite స్మార్ట్ ఫోన్ను రూ. 12,999 ధరకు కొనుగోలుచేయవచ్చు.

Huawei Nova 3i

ఈ హువావే నోవా 3i కూడా ముందు మరియు డ్యూయల్ కెమేరా సెటప్పుతో, క్వాడ్ కెమేరాలతో వస్తుంది. ఇది ముందుభాగంలో, 24+2MP మరియు వెనుక 16+2MP డ్యూయల్ కెమేరాలను కలిగివుంటుంది. ఈ ఫోన్ ఒక కిరిణ్ 710 ఆక్టా కోరే ప్రాసెసెరుతో వస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్, ప్రస్తుతం ధర రూ. 20,990 గా ఉండగా, దీనిపైన 4,000 రూపాయల డిస్కౌంట్ అందించనుంది ఈ సేల్ ద్వారా. అంటే, ఈ సేల్ నుండి ఈ Huawei Nova 3i  స్మార్ట్ ఫోన్ను రూ. 16,990 ధరకు కొనుగోలుచేయవచ్చు.      

Huawei Nova 3

 మొట్టమొదటి AI ఆధారిత 4 కెమేరాలు కలిగిన స్మార్ట్ ఫోనుగా ఈ హువావే నోవా 3 గురించి చెప్పవచ్చు. 24+16MP డ్యూయల్ కెమెరాలను ముందుభాగంలో కలిగివుంటుంది. 24+2MP వెనుక కెమెరాను కూడా కలిగివుంటుంది. ఈ ఫోన్ శక్తివంతమైన కిరిణ్ 970 ప్రాసెసరుతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్, ప్రస్తుతం ధర రూ. 34,999 గా ఉండగా, దీనిపైన 5,000 రూపాయల డిస్కౌంట్ అందించనుంది ఈ సేల్ ద్వారా. అంటే, ఈ సేల్ నుండి ఈ Huawei Nova 3i  స్మార్ట్ ఫోన్ను రూ. 29,999 ధరకు కొనుగోలుచేయవచ్చు.

Huawei P20 Pro

కెమేరాల టెస్టింగ్ మరియు రేటింగులను అందించే DxOMark ర్యాంకింగ్ ప్రకారంగా, ఈ స్మార్ట్ ఫోన్ బెస్ట్ కెమేరా ఫోనుగా ర్యాంక్ చేయబడింది. అంతేకాదు, Lica కెమేరాలతో ట్రిపుల్ కెమేరా సేతప్పును కలిగిన మొట్టమొదటి ఫోన్ కూడా ఇదే అవుతుంది. Huawei P20 Pro స్మార్ట్ ఫోన్నీ, ప్రస్తుతం  రూ. 59,999 రూపాయల ధరతో అందించనుంది ఈ సేల్ ద్వారా. అంతేకాకుండా, ఎక్స్చేంజితో 5000 తో పాటుగా 3 నెలల No Cost EMI కూడా అందిచనుంది.       

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo