Amazon GIF Sale 2025 big discount offer announced on iPhone 15
Amazon GIF Sale 2025 సేల్ నుంచి రూ. 43,999 ధరకే iPhone 15 అందుకోండి, అని అమెజాన్ ఇండియా భారీగా టీజింగ్ చేస్తోంది. అమెజాన్ అప్ కమింగ్ సేల్ నుంచి అందించనున్న టాప్ డీల్స్ అమెజాన్ రివీల్ చేసింది. ఈ టాప్ డీల్స్ లో ఐఫోన్ 15 ఫోన్ పైన అందించిన డీల్ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. ఎందుకంటే, ప్రస్తుతం దాదాపు 60 వేల రూపాయల ధరతో సేల్ అవుతున్న ఐఫోన్ 15 అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి అన్ని ఆఫర్స్ తో కలిపి కేవలం రూ. 43,999 రూపాయల అతి తక్కువ ధరకే లభిస్తుందని అమెజాన్ టీజింగ్ చేసింది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అప్ కమింగ్ టాప్ డీల్స్ ని అమెజాన్ ఇప్పుడు లిస్ట్ చేసింది. ఈ లిస్ట్ లో ఐఫోన్ 15 స్మార్ట్ ఫోన్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి అన్ని ఆఫర్స్ తో కలిపి కేవలం రూ. 43,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుందని లిస్ట్ చేసింది. ఈ ఫోన్ ఈ ఆఫర్ రేటుకే లభిస్తే నిజంగా ఈ పండుగ సీజన్ లో టాప్ బెస్ట్ డీల్ అవుతుంది.
వాస్తవానికి, ఐఫోన్ 15 ఫోన్ ప్రస్తుతం అమెజాన్ నుంచి రూ. 59,900 ప్రైస్ ట్యాగ్ తో లిస్ట్ అయ్యింది. అయితే, వేర్వేరు ప్లాట్ ఫామ్ పై వేర్వేరు రేట్లతో సేల్ అవుతోంది. మరి అమెజాన్ ఈ ఫోన్ పై ఎటువంటి డిస్కౌంట్ ఆఫర్స్ అందించి ఈ ఫోన్ ను రూ. 43,999 రూపాయలకే ఆఫర్ చేస్తుందో చూడాలి. సేల్ నుంచి ఈ ఫోన్ పై SBI బ్యాంక్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ 10% డిస్కౌంట్ అయితే కచ్చితంగా లభిస్తుంది. దీనితో పాటు ఎక్స్ చేంజ్ బోనస్ మరియు రెగ్యులర్ డిస్కౌంట్ కూడా అందించే అవకాశం ఉండవచ్చని ఊహిస్తున్నారు. అమెజాన్ సేల్ మొదలైన తర్వాత ఈ ఆఫర్ గురించి తెలుస్తుంది గా తెలుస్తుంది.
Also Read: Flipkart BBD Sale నథింగ్ ట్రిపుల్ కెమెరా ఫోన్ ను రూ. 14,999 ధరకే అందుకోండి.!
ఐఫోన్ 15 ఫోన్ డైనమిక్ ఐలాండ్ ఫీచర్ కలిగిన 6.1 ఇంచ్ సూపర్ రెటీనా XDR డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఇది సిరామిక్ షీల్డ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది మరియు అల్యూమినియం ఫ్రీమ్ తో డిజైన్ చేయబడింది. ఈ ఫోన్ A16 Bionic చిప్ తో పని చేస్తుంది మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. మీరు అధిక స్టోరేజ్ కోరుకునే మరో రెండు ఆప్షన్ లు కూడా లభిస్తాయి.
ఈ ఫోన్ లో 48MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇది 2x ఆప్టికల్ జూమ్, 4K Dolby Vision వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు యాపిల్ యొక్క ప్రత్యేకమైన కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ రోజంగా పని చేసే ఆల్ డే బ్యాటరీ మరియు USB-C ఛార్జ్ పోర్ట్ కలిగి ఉంటుంది.