అమేజాన్ నుండి “Fab Phones Fest” సేల్ : మొబైల్స్ పైన కళ్ళు చెదిరే డీల్స్
కొన్ని మొబైల్ ఫోన్ల పైన ఏకంగా 40% వరకు డిస్కౌంట్ ప్రకటించింది.
అమేజాన్ ఇండియా, ఇప్పుడు కొత్తగా మొబైల్ ఫోన్ల పైన బంపర్ అఫర్ ప్రకటించింది. ఈ అఫర్ "Fab Phones Fest" పేరుతొ మన ముందుకు వచ్చింది. ఈ అఫర్ మార్చి 25 నుండి మార్చి 28 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ అఫర్లో భాగంగా, అనేకమైన మొబైల్ ఫోన్ల పైన గొప్ప డిస్కౌంట్లు మరియు ఆఫర్లను కూడా ప్రకటించింది. దీనికి అధనంగా, SBI యొక్క క్రెడిట్ కార్డుతో EMI ద్వారా కొనుగోలు చేసేవారికి 5% క్యాష్ బ్యాక్ కూడా దొరుకుతుంది.
Surveyహానర్ ప్లే
గేమింగ్ కోసం హానర్ ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ హానర్ ప్లే స్మార్ట్ ఫోన్ 4D గేమింగ్ అనుభూతిని అందిస్తుంది. అలాగే, ఇది ఒక ప్రధాన కిరిణ్ 970 ఆక్టా కోర్ ప్రాసెసరుతో మంచి స్పీడ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క 4GB మరియు 64GB వేరియంట్ రూ. 21,999 ధరతో ఉండాగా ఈ సేల్ ద్వారా దీని పైన 7000 డిస్కౌంట్ అందిస్తోంది అమెజాన్ ఇండియా. ఈ సేల్ నుండి కేవలం రూ. 14,999 ప్రారంభదరావు కొనుగోలు చేయవచ్చు.
రియల్మీ U 1
కెమేరా సెంట్రిక్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ స్మార్ట్ ఫోన్, సెల్ఫీ కోసం 25MP సోనీ సెన్సార్ కెమెరాని కలిగి ఉంటుంది. వెనుక డ్యూయల్ కెమేరాలతో పాటుగా ఒక మీడియా టెక్ హీలియో P70 ప్రాసెసర్ తో వచ్చిన మొత్తానోదాటి ఫోనుగా కూడా ఈ ఫోన్ నిలుస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ రూ.12,999 ధరతో ఉండాగా ఈ సేల్ ద్వారా అమెజాన్ ఇండియా దీని పైన 3,000 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది.అధనంగా అన్ని బ్యాంకుల యొక్క డెబిట్ మరియు క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేయడంతో 1000 రూపాయల తక్షణ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. మొత్తంగా, ఈ సేల్ నుండి కేవలం రూ. 8,999 ధరతో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
రెడ్మి నోట్ 5 ప్రో
అత్యధికమైన అమ్మకాలను సాధించినా షావోమి ఫోనుగా గుర్తింపు పొందిన ఈ రెడ్మి నోట్ 5 ప్రో, మంచి స్పీసిఫికేషన్స్ తో ఉంటుంది. డ్యూయల్ రియర్ కెమెరా 20MP సెల్ఫీ కెమేరా, స్నాప్ డ్రాగన్ proce 636 ప్రాసెసర్ మరియు 4000 mAh బ్యాటరీ వంటి మంచి లక్షణాలతో వస్తుంది. ఈ స్మార్ట్ పైన పైన 5000 రూపాయల గొప్ప డిస్కౌంట్ అందుతుంది. ఈ సేల్ నుండి రూ. 10,999 రుపాయల ప్రారంభ ధరతో కొనుగోలు చెయ్యవచు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile