అమేజాన్ – FAB PHONE FEST సేల్ : మల్టి బ్రాండ్ స్మార్ట్ ఫోన్ల పైన బిగ్ డీల్స్
అమేజాన్ ఇండియా FAB PHONE FEST సేల్ పేరుతొ తన ఫ్లాట్ఫారం పైన మల్టి బ్రాండ్ స్మార్ట్ ఫోన్ల పైన బిగ్ డీల్స్ అందిస్తోంది. ఈ సేల్ కోసం అమేజాన్ ఇండియా తన వెబ్సైట్ లో ఒక ప్రత్యేక పేజీని కూడా సిద్ధం చేసింది. ఇందులో అనేక బ్రాండ్స్ యొక్క బెస్ట్ స్మృతి ఫోన్ల పైన భారీ డిస్కౌంట్లు కూడా అందిస్తోంది. ఇక ఆఫర్ల విషయానికి వస్తే, HDFC బ్యాంకు అన్ని కార్డులు మరియు EMI పైనా 10% తక్షణ డిస్కౌంట్ వంటి ఆఫర్లను కూడా ప్రకటించింది. ఈ సేల్ ఏప్రిల్ 11 వ తేదీ నుండి ఏప్రిల్ 13 వ తేదీ వరకు జరగనుంది.
Surveyఒక 6.41 అంగుళాల FHD+ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే, ఒక ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 16MP+20MP డ్యూయల్ రియర్ కెమేరాతో కలిగిన, ఈ OnePlus 6T వాస్తవానికి రూ.37,999 ధరతో విడుదలయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ పైన 3,000 రుపాయల డిస్కౌంట్ అందించి ఈ సేల్ ద్వారా అమ్మకాలను జరపనుంది. ప్రస్తుత సేల్ ధర రూ.34,999.
ఒక 5.84 అంగుళాల FHD+ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే, 4000 mAh బ్యాటరీ మరియు డ్యూయల్ కెమేరా సెటప్పు గల ఈ రెడ్మి 6 ప్రో స్మార్ట్ ఫోన్, రూ.13,499 ధరతో విడుదలయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ పైన 3,499 వరకు డిస్కౌంట్ అందించి ఈ సేల్ ద్వారా అమ్మకాలను జరపనుంది. ప్రస్తుత సేల్ ధర రూ.10,000.
ఒక 6.5 అంగుళాల FHD+ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే, రైజింగ్ సెల్ఫీ కెమేరా మరియు 48MP ప్రధాన కెమేరా సెటప్పు గల ఈ OPPO F11 Pro స్మార్ట్ ఫోన్, రూ.28,990 ధరతో విడుదలయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ పైన 4,000 వరకు డిస్కౌంట్ అందించి ఈ సేల్ ద్వారా అమ్మకాలను జరపనుంది. ప్రస్తుత సేల్ ధర రూ.24,990.
ఒక 5.99 అంగుళాల HD+ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే, క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 625 ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు ఫేస్ అన్లాక్ ఫిచారు గల ఈ రెడ్మి Y2 స్మార్ట్ ఫోన్, రూ.13,499 ధరతో విడుదలయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ పైన 3,499 వరకు డిస్కౌంట్ అందించి ఈ సేల్ ద్వారా అమ్మకాలను జరపనుంది. ప్రస్తుత సేల్ ధర రూ.10,990.
ఒక 6.3 అంగుళాల FHD+ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే, మీడియా టెక్ హీలియో P70 ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు Sony IMX 576 సెన్సార్ 25MP సెల్ఫీ కెమేరా గల ఈ Realme U1 స్మార్ట్ ఫోన్, రూ.12,999 ధరతో విడుదలయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ పైన 3,000 వరకు డిస్కౌంట్ అందించి ఈ సేల్ ద్వారా అమ్మకాలను జరపనుంది. ప్రస్తుత సేల్ ధర రూ.9,999.
ఒక 5.99 అంగుళాల FHD+ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే, క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 636 ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు షావోమి యొక్క ఆల్ టైం బెస్ట్ సెల్లింగ్ ఫోన్ గా పేరుతెచ్చుకున్న ఈ డ్మి నోట్ 5 ప్రో స్మార్ట్ ఫోన్, రూ.15,999 ధరతో విడుదలయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ పైన 5,000 వరకు డిస్కౌంట్ అందించి ఈ సేల్ ద్వారా అమ్మకాలను జరపనుంది. ప్రస్తుత సేల్ ధర రూ.10,999.
ఒక 6.5 అంగుళాల FHD+ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే, హై సిలికాన్ కిరిణ్ 710 ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు 20MP+2MP డ్యూయల్ కెమేరా సెటప్పు గల ఈ Honor 8X స్మార్ట్ ఫోన్, రూ.17,999 ధరతో విడుదలయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ పైన 5,000 వరకు డిస్కౌంట్ అందించి ఈ సేల్ ద్వారా అమ్మకాలను జరపనుంది. ప్రస్తుత సేల్ ధర రూ.12,999.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
