OnePlus 11R 5G పైన 12 వేల భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించిన Amazon

Updated on 22-May-2024
HIGHLIGHTS

Amazon ఇండియా OnePlus 11R 5G పైన 12 వేల భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది

11R 5G భారీ డిస్కౌంట్ ఆఫర్ తో మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో లభిస్తోంది

ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఎన్నడూ చూడనంత తక్కువ ధరకే లభిస్తోంది

Amazon ఇండియా OnePlus 11R 5G పైన 12 వేల భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ప్రీమియం సెగ్మెంట్ లో వచ్చిన ఈ ఫోన్, అమెజాన్ అందించిన భారీ డిస్కౌంట్ ఆఫర్ తో మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో లభిస్తోంది. అంతేకాదు, అమెజాన్ అందించిన ఈ ఆఫర్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఎన్నడూ చూడనంత తక్కువ ధరకే లభిస్తోంది.

OnePlus 11R 5G: Price & Offers

వన్ పీల్సు స్మార్ట్ ఫోన్ పైన అమెజాన్ ఈరోజు రూ. 10,000 రూపాయల భారీ డిస్కౌంట్ అందించింది. అందుకే ఈ ఫోన్ ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి రూ. 29,999 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క హై ఎండ్ (16GB + 256GB ) వేరియంట్ కూడా భారీ డిస్కౌంట్ తో రూ. 33,499 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది.

ఈ ఫోన్ పైన ALL Banks Card పేమెంట్ పైన రూ. 2,000 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

వాస్తవానికి, ఈ ఫోన్ లంచ్ సమయంలో రూ. 39,999 మరియు రూ. 44,999 రూపాయల ధరలతో మార్కెట్ లో అడుగు పెట్టింది. ఇప్పుడు అమెజాన్ నుంచి భారీ డిస్కౌంట్ లతో తక్కువ ధరలో సేల్ అవుతోంది.

Also Read: Poco Brand Days Sale నుండి పోకో లేటెస్ట్ ఫోన్ ల పైన భారీ ఆఫర్లు అందుకోండి.!

OnePlus 11R 5G: ప్రత్యేకతలు

వన్ ప్లస్ 11R స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ 120 Hz Super Fluid AMOLED డిస్ప్లే ని HDR10+ మరియు 1450 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో కలిగి వుంది. ఈ వన్ ప్లస్ ఫోన్ Snapdragon 8+ Gen 1 ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు జతగా 8GB / 16GB RAM తో గొప్ప పెర్ఫార్మెన్స్ అందిస్తుంది.

OnePlus 11R 5G Specs

ఈ వన్ ప్లస్ ఫోన్ 100W SUPERVOOC సూపర్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000mAh బ్యాటరీని కలిగి వుంది. ఈ ఫోన్ లో వెనుక 50MP Sony IMX890 (OIS) మెయిన్ + 8MP అల్ట్రా వైడ్ + Macro Lens తో ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి వుంది. ఈ కెమెరాతో 4K వీడియో లను 60fps / 30fps వద్ద చిత్రించవచ్చు. ఈ ఫోన్ లో 16MP సెల్ఫీ కెమెరా కూడా వుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :
Tags: tech news