iQOO Neo 6 5G పైన భారీ డిస్కౌంట్ అఫర్ ప్రకటించిన అమెజాన్.!

HIGHLIGHTS

iQOO Neo 6 5G ఈరోజు అమెజాన్ నుండి భారీ డిస్కౌంట్ ఆఫర్లతో లభిస్తోంది

ఐకూ నియో 6 5జి పైన 3,000 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది

iQOO Neo 6 5G ఈరోజు గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తోంది

iQOO లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ iQOO Neo 6 5G ఈరోజు అమెజాన్ నుండి భారీ డిస్కౌంట్ ఆఫర్లతో లభిస్తోంది. HDR10+ సర్టిఫైడ్ 120Hz రిఫ్రెష్ రేట్ E4 AMOLED డిస్ప్లే మరియు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి భారీ ఫీచర్లతో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తోంది. ఈ లేటెస్ట్ ఐకూ 5G స్మార్ట్ ఫోన్ ఆఫర్స్, ధర, ఫీచర్లు మరియు స్పెక్స్ తెలుసుకోండి.     

iQOO Neo 6 5G: ధర మరియు ఆఫర్లు

ఐకూ నియో 6 5జి స్మార్ట్ ఫోన్ యొక్క 8GB+128GB వేరియంట్ ధర రూ.29,999 మరియు 12GB+256GB వేరియంట్ ధర రూ.33,999. Amazon నుండి ఈ స్మార్ట్ ఫోన్ ICICI బ్యాంక్ కార్డు తో కొనేవారికి 3,000 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, Amex మరియు Standard Chartered బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ఈ ఫోన్ కొనేవారికి 1,500 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది.  

iQOO Neo 6 5G: స్పెక్స్

ఐకూ నియో 6 5జి స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1200Hz ఇన్స్టాంట్ టచ్ శాంప్లింగ్ రేట్ కలిగిన 6.62 ఇంచ్ పరిమాణం కలిగిన FHD+ రిజల్యూషన్ E4 AMOLED డిస్ప్లే ని కలిగి వుంది.ఈ డిస్ప్లే 1300 పీక్ బ్రైట్నెస్ అందించ గలదు మరియు HDR 10+ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 870 5G ప్రొసెసర్ తో పనిచేస్తుంది. దీనికి జతగా గరిష్టంగా 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది అలాగే, ఫోన్ ను నిరంతరం చల్లగా ఉంచడానికి 36907 mm² క్యాస్ కేడ్ కూలింగ్ సిస్టం ను కూడా కలిగి ఉంటుంది.

ఆప్టిక్స్ విభాగంలో, ఈ లేటెస్ట్ ఐ కూ 5G ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్పు ఉంది. ఈ ట్రిపుల్ కెమెరాలో 64MP OIS ప్రధాన కెమెరాకి జతగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 2MP మ్యాక్రో సెన్సార్ తో వస్తుంది. ముందుభాగంలో, 16MP సెల్ఫీ కెమెరాని సెల్ఫీల కోసం అందించింది. ఈ 5G స్మార్ట్ ఫోన్ లో 4,700mAh బ్యాటరీని 80W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది. మొబైల్ గేమర్‌ లను ఆకర్షించడానికి, ఈ ఫోన్ లో 4D గేమ్ వైబ్రేషన్ ని లీనియర్ వైబ్రేషన్ మోటార్ తో జతచేసింది. 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :