amazon announced big Price Cut on realme NARZO 80 Pro 5G
Price Cut: రియల్ మీ ఇండియాలో ఇటీవల విడుదల చేసిన లేటెస్ట్ కర్వుడ్ డిస్ప్లే ఫోన్ Realme NARZO 80 Pro 5G పై భారీ డిస్కౌంట్ ను అమెజాన్ ఈరోజు అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు అమెజాన్ అందించిన బిగ్ డిస్కౌంట్ తో చాలా చవక ధరలో లభిస్తుంది. అందుకే, ఈరోజు అమెజాన్ అందించిన ఈ బిగ్ స్మార్ట్ ఫోన్ డీల్ వివరాలు అందిస్తున్నాము.
రియల్ మీ నార్జో 80 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 19,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు రూ. 2,500 రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ. 17,498 రూపాయల ప్రైస్ తో లిస్ట్ చేసింది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 1,000 రూపాయల అదనపు కూపన్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 16,498 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. Buy From Here
Also Read: Aadhaar on WhatsApp: వాట్సాప్ లో మీ ఆధార్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.!
రియల్ మీ నార్జో 80 ప్రో స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7400 5G చిప్ సెట్ తో వచ్చిన సెగ్మెంట్ మొదటి స్మార్ట్ ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం 7.55mm మందంతో చాలా స్లీక్ గా ఉంటుంది. ఈ ఫోన్ 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన హైపర్ గ్లో AMOLED Esports స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 90 FPS BGMI కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ IP 69 రేటింగ్ తో మంచి వాటర్ ప్రూఫ్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో 50MP (Sony IMX 882) మెయిన్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 16MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు మంచి కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6000 mAh బిగ్ టైటాన్ బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 80W అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కంటే ముందే మంచి డిస్కౌంట్ ప్రైస్ తో సేల్ అవుతోంది.